గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళా ప్రాంగణం లోని కళా వేదికపై సాంస్కృతిక ప్రదర్శనలో ఉత్సాహంగా కొనసాగాయి. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కళాశాల ఆధ్వర్యంలో హిమబిందు గాత్రం కచేరి చేశారు, వివిధ వాగ్గేయ కళాకారుల రచించిన కీర్తనలు శ్రవణానందంగా గానం చేసి, వీక్షికులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకువెళ్ళారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గరగల్లు నృత్యం అద్భుతంగా ప్రదర్శించారు. పంజాబ్ ,వెస్ట్ బెంగాల్ కళాకారులు బాంగ్రా నృత్యాన్ని ఉత్సాహంగా ప్రదర్శించారు. సాంప్రదాయ, వెస్ట్రన్ డాన్స్ లు ప్రదర్శించారు. డిఆర్డిఏ మేనేజర్ మహిత, పెద్ద …
Read More »Daily Archives: January 10, 2026
మేళాను పరిశీలించిన జిల్లా కలెక్టరు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం రాత్రి సరస్ మేళాను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. స్టాల్స్,, భోజనశాలను, ఫుడ్ కోర్టును, త్రాగునీరు పంపులను పరిశీలించి, స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనగ వారు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధులు కేటాయించిన అధికారులు నిరంతర అప్రమత్తంగా ఉంటూ స్టాల్స్ నిర్వహణకు, కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శనివారం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున, …
Read More »గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయాల కోసం సరస్ మేళాలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశం, రాష్ట్రంలోని గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయాల కోసం సరస్ మేళాలు నిర్వహిస్తున్నామని ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు తెలిపారు. శనివారం సరస్ మేళా ను ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు సందర్శించి, వ్యవస్థలో స్వయం సహాయక సంఘ సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి …
Read More »విధులు కేటాయించిన అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి… : డీ ఆర్ డీ ఏ పీడీ విజయలక్ష్మి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సరస్ మేళాలో విధులు కేటాయించిన అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీ ఆర్ డీ ఏ పీడీ విజయలక్ష్మి తెలిపారు. శనివారం సరస్ మేళా లో స్టాల్స్ , ఫుడ్ కోర్టు, భోజనశాల, ఎంమ్యూజ్మెంట్ పార్క్ వద్ద పరిశీలించి, అక్కడ విధులు కేటాయించిన అధికారులు ఉద్యోగులతో వివరాలు తెలుసుకున్నారు. శని ఆదివారాలు సెలవు దినాలు అయినందున ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్ ను సందర్శించే అవకాశం ఉన్నందున వివిధ ప్రాంతాల్లో విధులు కేటాయించిన అధికారులు నిరంతరం అప్రమత్తంగా …
Read More »మేళాలో ప్రత్యేక ఆకర్షణగా పోస్టల్ శాఖ స్టాల్
-శనివారం ఉదయం నుంచి కొనసాగుతున్న వినియోగదారుల సందడి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్ మేళాలో 301,302 స్టాల్స్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖ ప్రజలకు వివిధ రకాల పోస్టర్ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. పోస్టల్ అకౌంట్లు ఓపెనింగ్ తో పాటు, మై స్టాంపును అక్కడే క్రియేట్ చేసి ఇస్తున్నారు. రూ. 300 తో మన ఫోటోతో ఐదు రూపాయలు విలువ కలిగిన 12 పోస్టల్ స్టాంపులను అందిస్తున్నారు. …
Read More »మేడికొండూరులో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన కలెక్టర్
మేడికొండూరు (గుంటూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : మేడికొండూరులో పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్యతో ఉన్న, భూమి వివరాలతో కూడిన రాజ ముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను మేడికొండూరు మండలం విశదల, వెలువర్తి, డోకిపర్రు గ్రామాల్లో శనివారం జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసినట్టు చెప్పారు. …
Read More »నైపుణ్యాల చిరునామా – సరస్ మేళా
-సరస్ మేళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమాలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్ మేళా అఖిలభారత డ్వాక్రా బజార్ లో స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా మారటానికి అవసరమైన నైపుణ్యాలపై యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిమాండ్ ఉన్న వస్తువుల ఉత్పత్తి క్రియేటివ్ గా మార్కెటింగ్ ఆలోచనలు, వ్యాపారానికి అనువైన ప్రాంతాల ఎంపిక, అవసరమైన శిక్షణ అందించే సంస్థల …
Read More »పదవీ విరమణ వయస్సు పెంచడం నిరుద్యోగ యువతను వంచించడమే
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పదే పదే పదవీ విరమణ వయోపరిమితిని పెంచడం నిరుద్యోగ యువతను వంచించడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా విమర్శించారు. పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచే నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత జీవితం అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వాలు …
Read More »నదీ జలాల వివాదాలను ఎపీ, తెలంగాణాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి..
– సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోర్టులు, కేంద్ర ప్రభుత్వం వద్ద పంచాయితీ పెట్టకుండా నదీజలాల వివాదాన్ని ఎపీ, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి, సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను కోర్టులు, కేంద్ర ప్రభుత్వం వద్ద కాకుండా ఎపీ, …
Read More »
Prajavartha Online Telugu News