Breaking News

మేళాను పరిశీలించిన జిల్లా కలెక్టరు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం రాత్రి సరస్ మేళాను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. స్టాల్స్,, భోజనశాలను, ఫుడ్ కోర్టును, త్రాగునీరు పంపులను పరిశీలించి, స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనగ వారు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విధులు కేటాయించిన అధికారులు నిరంతర అప్రమత్తంగా ఉంటూ స్టాల్స్ నిర్వహణకు, కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శనివారం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నందున, రానున్న రోజుల్లోనూ ప్రజల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల అధికారి కోమలి పద్మ, , ఏపీడి అశోక్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *