Breaking News

గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయాల కోసం సరస్ మేళాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశం, రాష్ట్రంలోని గ్రామీణ మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయాల కోసం సరస్   మేళాలు నిర్వహిస్తున్నామని  ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు తెలిపారు. శనివారం సరస్ మేళా ను ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు సందర్శించి, వ్యవస్థలో స్వయం సహాయక సంఘ సభ్యులు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు అవకాశం కల్పించారన్నారు. స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన ఉత్పత్తులకు డ్వాక్రా బజార్ ద్వారా  మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారన్నారు. కేంద్రమంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో దేశస్థాయిలో నిర్వహించే అన్ని కార్యక్రమాలను గుంటూరులో నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి జిల్లాలో త్వరలోనే ఊరగాయలు, గార్మెంట్స్ , పాడి పరిశ్రమ హబ్  ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక ఉత్పత్తులను మరింతగా తయారుచేసేలా మహిళలు పనిచేయాలని సూచించారు. మహిళా శక్తిని మరింతగా ముందుకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. బోటిక్ సెంటర్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో  డిఆర్డీఎ పిడి విజయలక్ష్మి, ఎపిడీ కిరణ్ కుమార్ , కార్పొరేటర్ స్మితా పద్మజ , పత్తిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ అమరేశ్వరి, పత్తిపాడు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *