Breaking News

మేళాలో ప్రత్యేక ఆకర్షణగా పోస్టల్ శాఖ స్టాల్

-శనివారం ఉదయం నుంచి కొనసాగుతున్న వినియోగదారుల సందడి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రెడ్డి కళాశాల సమీపంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సరస్ మేళాలో 301,302 స్టాల్స్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ శాఖ ప్రజలకు వివిధ రకాల పోస్టర్ సేవలపై అవగాహన కల్పిస్తున్నారు. పోస్టల్ అకౌంట్లు ఓపెనింగ్ తో పాటు, మై స్టాంపును అక్కడే క్రియేట్ చేసి ఇస్తున్నారు. రూ. 300 తో మన ఫోటోతో ఐదు రూపాయలు విలువ కలిగిన 12 పోస్టల్ స్టాంపులను అందిస్తున్నారు. తపాల శాఖ ద్వారా అందిస్తున్న పొదుపు ఖాతాలు వడ్డీ రేట్లు, డిపాజిట్లు, నెలసరి ఆదాయ పథకాలు, 15 సంవత్సరాల పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లు, వయోవృద్ధుల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి ఖాతా, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు గురించి పూర్తి వివరాలు అందజేస్తున్నారు. ఈ కామర్స్ కు సంబంధించి పార్సెల్ ఎక్స్ స్పోర్ట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. మేళాలో కొనుగోలు చేసిన వస్తువులను పార్సిల్ కు ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్ ను పోస్టల్ శాఖ ఏర్పాటు చేసింది. పోస్టల్ శాఖ పథకాలపై, వాటిని వినియోగించుకుంటున్న లబ్ధిదారుల ఫీడ్బ్యాక్ ను ఎల్ఇడి ద్వారా ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా 303 స్టాల్ బిఎస్ఎన్ఎల్ రూపాయికే సిమ్ కార్డులను అందించే కౌంటర్ ను ఏర్పాటు చేశారు. బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సంబంధించి వివిధ ప్లాన్లను వివరిస్తున్నారు.

ఉదయం నుంచి మేళాలో కొనుగోలుదారుల సందడి
శనివారం ఉదయం నుంచి కొనుగోలుదారుల సందడి ప్రారంభమైంది. మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన హస్తకళల ఉత్పత్తులు, వస్త్రాలు, అలంకరణ వస్తువులు, ఆయుర్వేద వస్తువులు, సిరి ధాన్యాల ఉత్పత్తులు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, ఇతర వస్తు సామాగ్రి సరసమైన ధరకు అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రజల తాకిడికి అనుగుణంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఉద్యోగులు, పారిశుధ్య పనుల కోసం మున్సిపల్ శాఖ, బందోబస్తు నిమిత్తం పోలీస్ శాఖ, విద్యుత్తు అగ్నిమాపక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా మేళాలో వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *