Breaking News

Daily Archives: January 17, 2026

కృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా పాకాల మండలంలో విగ్రహ ఆవిష్కరణ – ఘనంగా నిర్వహణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ కృష్ణదేవరాయలు వారి జయంతి సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి శాసనసభ్యులు ఆరాణి శ్రీనివాసులు, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరై కార్యక్రమానికి శోభ చేకూర్చారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి ముఖ్య అతిథులు …

Read More »

క్యాలెండర్ పండుగకు విశేష స్పందన

-ఎంజీ రోడ్డులో సందడే సందడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్లవేళలా వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు పైలట్ సర్వీస్ స్టేషన్ పెట్రోల్ బంక్ (ఐఓసీ) సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్యాలెండర్ పండుగకు విశేష స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9:00 వరకు దాదాపు 850 మంది వినియోగదారులు తమ తమ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఉత్సాహంగా ఫోటోలు దిగి అనంతరం 2026 కలర్ ఫుల్ క్యాలెండర్ తమ వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ అధిపతి ఎంవివి సత్యనారాయణ …

Read More »

“స్వచ ఆంధ్ర” కార్యక్రమంలో సైకిల్ పై కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : “స్వచ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణములోనికి “సైకిల్”* వస్తున్న దృశ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశాల ప్రకారం వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛ మైన గాలి కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలోకి వచ్చే ప్రతి ఒక్కరు కాలినడకన లేదా సైకిల్ పై రావాలి అని తెలిపారు.

Read More »

జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 26న గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పోలీసు కవాతు మైదానంలో జరిగే జిల్లా స్థాయి వేడుకలకు జిల్లా ప్రగతిని వివరించేలా శకటాల రూపకల్పన చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి శనివారం ఉదయం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శకటాల రూపకల్పనపై చర్చించి దిశా …

Read More »

జిల్లా కోర్టు పరిధిలో మూడు కేటగిరీలకు చెందిన పోస్టుల భర్తీకి నోటిఫీకేషన్ జారీ

– జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్–III, కేటగిరీ–3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు భర్తీ (రాత పరీక్ష : 08-02-2026 | నైపుణ్య పరీక్ష : 12-02-2026) డివిజన్–III లోని కేటగిరీ–3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీలో 01 ఖాళీ ఉండగా, వేతన శ్రేణి రూ.28,280/- నుండి రూ.89,720/- వరకు ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ నైపుణ్యం కలిగి …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో జనవరి 19 నుంచి 31 వరకు “పశు ఆరోగ్య శిబిరాలు”

-ప్రత్యేక ప్రచారం – గోడ ప్రతులు ఆవిష్కరణ -ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణ లక్ష్యంగా జనవరి 19 నుండి 31, 2026 వరకు జిల్లాలోని పశుపాలక రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు తూర్పు గోదావరి ఇంచార్జి జిల్లా కలెక్టర్(ఎఫ్ ఎ సి) / జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన “పశు ఆరోగ్య శిబిరాలు” ప్రత్యేక …

Read More »

కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చడం ఆనందదాయకం

-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 20వ తేదిన జరిగే అధికారిక కార్యక్రమమైన కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డూండి రాకేష్ మాట్లాడుతూ… సంక్రాంతి సంబరాలు జరుపుకున్నట్లుగానే ఈ నెల 20న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకోవాలి. మఘశుద్ధ …

Read More »

ట్రంప్ కు మోదీ దాసోహం

-బెదిరింపులకు బయబడి దేశాన్ని తాకట్టు పెట్టడం సరికాదు.. -చంద్రబాబు, నితిశ్ కుమార్ అండతోనే బిజేపి ప్రభుత్వం.. -రెండు తెలుగు రాష్ర్టాల జలవివాదాలు సామరస్యంగా పరిష్కరించకోవాలి.. -రెండవసారి ల్యాండ్ పూలింగ్ క్రిమినల్ చర్య.. -రాజధాని ప్రజానీకం కన్నీరు మంచిదికాదు.. – టీడీపీకి ఆక్సిజన్ అమరావతి ఉద్యమమే… – భూములాక్కుని రైతు నోట్లో మట్టి కొడతవా…. – సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కే నారాయణ.. – ఖమ్మంలో నేడు జరిగే శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి.. – జి ఈశ్వరయ్య పిలుపు విజ‌య‌వాడ, నేటి పత్రిక …

Read More »

విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టండి…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విస్తృతంగా యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టమని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కె. అర్జున రావు అన్నారు. శనివారం ఉదయం బయాలజీస్ట్, మలేరియా సిబ్బంది తో యాంటీ లార్వా ఆపరేషన్ విస్తృతంగా చేప్పటాలని ఆదేశించారు. సైడ్ డ్రైన్ లలో నీటి నిలువల వల్ల కాలువలో దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నందున వాటిలో డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేసి, సైడ్ డ్రైన్ లో నీటి ప్రవాహం లో ఎటువంటి ఆటంకం లేకుండా పరిశుభ్రపరిచి, …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

-కుటుంబ సమేతంగా వెంకటేశ్వరుని సేవలో ఎమ్మెల్యే తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ – విజయలక్ష్మి దంపతులు, కుమార్తె – అల్లుడు శీలం కృష్ణప్రభ-అశ్విన్ కుమార్ దంపతులు, కుమారుడు, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్- సాయి సుప్రియ దంపతులు తిరుమలేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వారి వెంట మనుమరాండ్రు పాల్గొన్నారు.

Read More »