-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 20వ తేదిన జరిగే అధికారిక కార్యక్రమమైన కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం విజయవంతం చేయాల్సిందిగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పిలుపునిచ్చారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డూండి రాకేష్ మాట్లాడుతూ… సంక్రాంతి సంబరాలు జరుపుకున్నట్లుగానే ఈ నెల 20న శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని జరుపుకోవాలి. మఘశుద్ధ విదియ రోజున జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా చేయడం ఆనందదాయకం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టో ప్రకారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాదిలోనే.. తిరుమల వెంకటేశ్వర స్వామికి, కనకదుర్గమ్మ అమ్మవారికి, శ్రీశైల మల్లన్న స్వామికి పట్టువస్త్రాలు సమర్పించినట్లుగానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తూ. గో జిల్లా పెనుగొండలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారికి కూడా పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆచారం సదా ఇలాగే కొనసాగుతుంది. కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గౌరవం దక్కితే ఆ గౌరవం ఆర్యవైశ్యులందరికీ దక్కినట్లే. గత వైసీపీ హయాంలో దేవాదాయశాఖ మంత్రిగా ఉండిన వ్యక్తి వైశ్యుల కోసంగానీ.. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాల అభివృద్ధికిగానీ ఏమీ చేయలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్యవైశ్యుల కోరికను మన్నించారు. అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగగా తీర్చిదిద్దారు. స్టే్ట్ ఫెస్టివల్స్ గా చేశారు. జీఐడీ శాఖ వారు ఇచ్చిన జీవో నెం.15 లో 25 స్టేట్ ఫెస్టివల్స్ గా డిక్లైర్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24 కార్యక్రమాలను డిసైడ్ చేసింది. వీటిలో 3 కార్యక్రమాలు ఆర్యవైశ్యులకు సంబంధించినవిగా ఉండడం ఆనందదాయకం. తమను ప్రభుత్వం గుర్తించడంపట్ల ఆర్యవైశ్యులందరూ సగౌరవంగా గర్విస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాలను 20 వ తేదిన జరిగే అధికారిక కార్యక్రమానికి సిద్ధం చేయాలి. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేసిందనడానికి జీవో నెం.15 నిదర్శనం. అమరజీవి పొట్టిశ్రీరాముులు త్యాగం మరువలేనిది. తెలుగు ప్రజల గౌరవం, అభ్యున్నతి కోసం తన ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి. పొట్టిశ్రీరాములు పేరున శ్మతివనం నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సహృదయంతో స్పందించారు. అమరావతి నడిబొడ్డున 6.8 ఎకరాల భూమిని పొట్టిశ్రీరాములు స్మతివనానికి కేటాయించారు. ఇటీవల పొట్టిశ్రీరాములు 125 వ జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. మార్చి 16న ఆయన 58 రోజుల దీక్షకు ప్రతీకగా 58 అడుగుల విగ్రహావిష్కరణ చేయనున్నాం. తమ ట్రస్టుకు ప్రభుత్వ అండదండలు మెండుగా ఉన్నాయి. చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి వైశ్యులు ఎంతో రుణపడి వున్నారు. ఆర్యవైశ్యులపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ దీంతో అర్థమౌతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామం కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలం. ఈ గ్రామానికి వాసవి పెనుగొండ అని పేరు పెట్టాలని వచ్చిన ప్రభుత్వాలనల్లా కోరాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా దానిపై దృష్టి పెట్టలేదు. చివరకు చంద్రబాబు అంగీకరించారు. పెనుగొండ గ్రామాన్ని వాసవీ పెనుగొండగా మారుస్తూ జీవో ఎం ఎస్ నెం. 521 తేగలిగామంటే కూటమి ప్రభుత్వ నిర్దిష్ట పాలనకు నిదర్శనం. మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఆర్యవైశ్యుల కోరిక మేరకు వాసవీ పెనుగొండ గ్రామంగా పేరు పెట్టారు. మాఘశుద్ధ విదియ రోజున కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా జరుపుదాం. అధికారులకు, నాయకులకు ఆహ్వాన పత్రికలు పంపుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మస్థలమైన పెనుగొండను వాసవీ పెనుగండగా మార్చినందుకు ధన్యవాదాలు. ప్రజలు మెచ్చే పరిపాలన సాగిస్తున్నారు. ఆర్యవైశ్యులకు నారా లోకేష్ సహకారం మెండుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల సహకారంతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేస్తామని ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ తెలిపారు.
Prajavartha Online Telugu News