-బెదిరింపులకు బయబడి దేశాన్ని తాకట్టు పెట్టడం సరికాదు..
-చంద్రబాబు, నితిశ్ కుమార్ అండతోనే బిజేపి ప్రభుత్వం..
-రెండు తెలుగు రాష్ర్టాల జలవివాదాలు సామరస్యంగా పరిష్కరించకోవాలి..
-రెండవసారి ల్యాండ్ పూలింగ్ క్రిమినల్ చర్య..
-రాజధాని ప్రజానీకం కన్నీరు మంచిదికాదు..
– టీడీపీకి ఆక్సిజన్ అమరావతి ఉద్యమమే…
– భూములాక్కుని రైతు నోట్లో మట్టి కొడతవా….
– సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ కే నారాయణ..
– ఖమ్మంలో నేడు జరిగే శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి..
– జి ఈశ్వరయ్య పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు దాసోహం అవ్వడం సిగ్గుచేటని సీపీఐ జాతీయ కంట్రోల్ కమీషన్ ఛైర్మన్ కే నారాయణ ఎద్దేవా చేశారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో జరుగనున్న పార్టీ శతాబ్ది ముగింపు వేడుకలను పురస్కరించుకుని శనివారం విజయవాడలోని దాసరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం నేడు ఉద్రిక్తత వాతావరణంలో ఉందని ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వెనిజులా అధ్యక్షుడని, తన బాల్యాన్ని రాత్రికి రాత్రే కిడ్నాప్ చేయడం అత్యంత దురదృష్టకరమైన చర్యగా అభివర్ణించారు.అణ్వాయుధాలు, డ్రగ్స్ సరఫరా నెపంతో వివిధ దేశాలపై దాడులకు తెగపడటం మంచి పరిణామం కాదన్నారు. ఆయా దేశాల రాజకీయ, ఆర్థిక మూలలపై దెబ్బ కొట్టేందుకు ట్రంప్ బ్లాక్ మెయిల్ సింబల్ గా నిలిచాడని పేర్కొన్నారు. దేశంలో పాలన చేస్తున్న మోదీ పర్యటనలో పేరుతో ఇతర దేశాల్లో ఎక్కువగా ఉంటున్నాడని, ట్రంప్ తో స్నేహసంధాలు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. సుంకాలు పేరు తో భారీగా భారాలు మోపుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, నితిశ్ కుమార్ అండతో కేంద్రంలో బిజేపి పాలన చేస్తోందని, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ కి ఎందుకు వంతపాడుతున్నారని నిలదీశారు. స్వప్రయోజనాలు కోసం మోదీ కి, ట్రంప్ కు దాసోహం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల రెండు తెలుగు రాష్ర్టాల జలవివాదాలు తారస్థాయికి చేరుకున్నాయని , ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అమరావతి రాజధాని కోసం రెండవ సారి భూములు లాక్కోవడం మంచి పద్ధతి కాదని సీఎం చంద్రబాబుకు సూచన చేశారు.గత జగన్ మోహన్ రెడ్డి సమయంలో అమరావతి ప్రజలు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావని మరలా అదే పరిస్థితులను కూటమి ప్రభుత్వం తీసుకురావడం సరికాదని హితవు పలికారు. అమరావతి ఉద్యమాల్లో అనేకమార్లు పాల్గొన్నానని ప్రజల కన్నీరు తెలుసని ఆ కన్నీళ్లు ఊరికేపోవమని మరలా ఆ పరిస్థితి రాకుండా చంద్రబాబు చూడాలని స్పష్టం చేశారు. టీడీపీ కి ఆక్సిజన్ ఇచ్చినవారికి చేయకుండా ఇంకేవ్వరికి చేస్తావని నిలదీశారు. అయినాళ్ళోకు ఆకుల్లో…కానోళ్ళకి కంచంలో పెడతావా..? కొండను తవ్వి ఎలుకను పడతవో… లేకపోతే కొండనే తవ్వుతావో తెలియదుకాని అమరావతి ప్రజలకు అన్యాయం చేయవద్దని హితవు పలికారు. అమరావతిలో చాలా మంది తెలిసినవారు ఉన్నారని ఇటీవల ఓ రైతు ఆవేదనతో మరణిస్తే, గుండె పోటు తో చనిపోయాడని చిత్రీకరీంచడం ఎంత వరకు సబబు, ఇది ప్రభుత్వం హత్యా కాదని ప్రశ్నించారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యత అమరావతికి ఇవ్వకుండా ఏఐ… విశాఖపట్నం.. అంటూ ఇంకేదో గాల్లో చూపించడం మంచి పరిణామం కాదన్నారు. రాజధాని విస్తరణ వైపు కాకుండా ప్రజలను సంతృప్తి పరచాలని హితవు పలికారు. భుముల ధరలు పెరగకుండా ఉన్నప్పుడే దురుద్దేశంతో భూములు బలవంతంగా లాక్కొవడం క్రిమినల్ చర్య అన్నారు. భూములు రైతు వద్ద ఉంటే ధరలు పెరిగినప్పుడు రైతుకు మేలు జరుగుతుంది కదా..? మొత్తం లాక్కుని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి రైతు నోట్లో మట్టి కొడతవా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రాజధానిలో ఒక్క ఇంటికి కూడా నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. స్కూల్స్, స్టేడియం కు వెళ్లడానికి దారి లేదు.. గ్రామస్తులు సమస్యలు పరిష్కరించకుండా దండోరా వేయించి ప్లాట్ నెంబరులు ఇచ్చారని తెలిపారు. ఆ నెంబర్లను తీసుకుని ఫ్లాట్ వద్దకు వెళ్లితే భూమి యజమానులు తరిమి వేశారని తెలిపారు. ఈ విషయం జరిగిన గంటలో 110మంది రైతులు నా దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. రాజధానిలో సమస్యలు చాలా ఉన్నాయని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మోదీ, ట్రంప్ మెప్పుపొండానికి ఏమి చేస్తారో నాకు తెలియదు.. అమరావతి ప్రజానికానికి స్పష్టమైన మేలు జరగాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మొట్టమొదటి సారిగా పార్టీ శతాబ్ది ముగింపు వేడుకలను జరుగుతున్నాయని దాదాపుగా 4 నుండి 5లక్షల వరకు ప్రజలు తరలి రానున్నారని తెలిపారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ పెద్ద ఎత్తున జరుగునున్న శతాబ్ది ముగింపు వేడుకలకు వివిధ ప్రాంతాల తరలిస్తున్న కార్యకర్తలకు, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వంద సంవత్సరాల పార్టీ చరిత్రలో దేశంలోని ఆర్ధిక, రాజకీయ, సామాజిక అంశాలతో పాటు ప్రజల జీవన విధానాల్లో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపారు. ఆ ఉద్యమాన్ని పునరేకీకరణ చేసుకుంటూ భవిష్యత్తు ఉద్యమాలకు ప్రణాళికలు రూపకల్పన ఈ వేడుకల్లో చేసుకుంటామని చెప్పారు. దేశంలోని ఐదు వామపక్ష పార్టీలు, ఇతర దేశాల నుంచి వివిధ కమ్యూనిస్టు పార్టీ నాయకులు తరలిరానున్నారని తెలిపారు. ముందున్న సవాళ్ళను నేడు ఫాసిస్టు పాలన ప్రభుత్వాలు విధానాలను ఎండగట్టేందుకు ఎలాంటి పోరాటాలకు సిద్ధంకాలనేది చర్చించుకుంటామని ప్రకటించారు.సభ ముగిసిన తరువాత మూడు రోజులు పాటు పార్టీ జాతీయ సమితి సమావేశాలు, అనంతరం ప్రపంచ స్థాయి సెమినార్ జరుగుతుందని తెలిపారు. రాష్ర్టంలో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. భూ స్కాం లు సర్వాంతర్యామి గా మారుతున్నాయని, చెప్పంది ఒకటి చేసేది మరోకటిలా వ్యావహారిస్తోందని అన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో తగ్గేది లేదంటూ 17 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణకు పూనుకున్నారని మండిపడ్డారు. రాజధానిలో 53 వేల ఎకరాలు ఎక్కువ అనుకుంటే మరలా ల్యాండ్ పూలింగ్ కు ఆహ్వానించడం సరికాదన్నారు. దీంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతుందని అన్నారు. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్న రాజధాని రైతులు సమస్యలు పరిష్కరించలేని రాబోయే రోజుల్లో రైతులు పక్షంగా సీపీఐ పోరిడుతుందని స్పష్టం చేశారు. ఎర్రజెండా నేలకొరిగింది.. ఆ జెండా ఏమి సాధ్యం కాదని చెబుతున్న పాలకులకు ఖమ్మం లో సభ హెచ్చరిక కానుందన్నారు. ఆ స్ఫూర్తితో మరింత పెద్ద ఎత్తున విస్తృత పరచి ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సూచించారు. రానున్న రోజుల్లో వామపక్షాలు ఐక్యతకు పునరేకీకరణ కావాలని కోరుకుంటూ , రాష్ర్టంలో ఉన్న ఇతర శక్తులను ఐక్యం చేసి రాజకీయ కర్తవ్యాన్ని రూపొందించుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News