విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో నగర అభివృద్ధి గురించి చర్చించడానికి గురువారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు సభ్య సమాజం అసహ్యించుకునేలా వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. డివిజన్ పర్యటన లలో భాగంగా శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12 వ డివిజన్ లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించిన ఆవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి వారి సమస్యలను, ప్రభుత్వ పాలన మీద ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారి చేతుల మీద జరిగిన 30 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న యలమంచిలి వెంకటప్పయ్య వీధి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన స్థానిక సంస్థ ల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ డివిజిన్లో పర్యటించినప్పుడు ప్రజలు ఈ రోడ్డు గురుంచి నా దృష్టికి తీసుకురాగా ఎన్నికలు అయిన కేవలం మూడు నెలల్లో నిధులు మంజూరు చేపించి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని, అంతేకాకుండా వెంటనే పనులు మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేసారు.స్వల్ప తేడాతో ఓటమి చెందిన సరే నిరుత్సాహ పడకుండా మాగంటి నవీన్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కరనికి కృషి చేస్తున్న తీరు అభినందనీయం అని అన్నారు. ఈ డివిజన్ లో వైస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దాదాపు కోటి రూపాయలు నిధులు వెచ్చించి ప్రతి కాలనీలో అంతర్గత రోడ్లు నిర్మించడం జరిగిందని,అదేవిధంగా కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంటి ఇంటికి వెళుతుంటే మహిళలు బ్రహ్మారధం పడుతూ స్వాగతం పలుకుతున్నారు అని,ప్రభుత్వ పాలన పట్ల వారు వ్యక్తం చేస్తున్న సంతోషం చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు.అధికార, ప్రతిపక్ష నేతలు అందరూ కలిసి కట్టుగా కృషి చేసి నగర అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యలపై తగు సలహాలు సూచనలు ఇవ్వడానికి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్లు వారి ప్రచార పిచ్చితో చిల్లర రాజకీయాలకు తెరలేపి పిచ్చి పిచ్చి చేష్టలతో రచ్చ చేయడం సిగ్గుచేటు అని,మీకు ప్రజా సమస్యల పరిష్కారం మీద వున్న చిత్తశుద్ధి ఏపాటిదో నిన్నటి సంఘటన తో ప్రజలకు అర్ధమయ్యింది అని అన్నారు.ఓడిన గెలిచిన వైస్సార్సీపీ నాయకులు నిత్యం ప్రజలలో తిరుగుతూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు వారి రాజకీయ మనుగడ కోసం ప్రచార ఆర్భాటాలతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ ఛార్జ్ మాగంటి నవీన్, అధ్యక్షులు రిజ్వాన్,ధనేకుల రామ కాళేశ్వరరావు,సుగుణేశ్వరవు,అతహర్,త్రినాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …