మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్లకు వేసిన తాళాలు, సీళ్ళు పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ, సీసీ కెమెరాలు పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలన్నారు. తనిఖీ రిజిస్టరులో సంతకం చేసారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నెలవారి తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్ తనిఖీ చేసి నివేదిక పంపవలసి ఉంటుంది. ఈ మేరకు కలెక్టర్ ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …