విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ సచివాలయాలన్నింటిలోను ఆధార్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్ చెప్పారు. శనివారం 20 సచివాలయాలకు చెందిన అర్హత పొందిన డిజిటల్ అసిస్టెంటులకు జెసి శివశంకర్ ఆధార్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాలన్నింటిలోను ఆధార్ సేవలు అందించే కార్యక్రమంలో భాగంగా గతంలో 11 సచివాలయాలకు ఆధార్ కిట్లు అందించామన్నారు. వారు ఇప్పటికే ఆధార్ సేవలు తమ సచివాలయాలనుంచి ప్రారంభించరన్నారు. రెండవ విడతలో 20 సచివాలయాలకు ఒక లాప్టాప్, మోనిటర్, ప్రింటర్ స్కానర్, ఐరిస్ డివైజ్, కెమెరా, ఫింగర్ ప్రింట్ డివైన్లతో కూడిన ఆధార్ కిట్లను అందించమాన్నారు. మోపిదేవి, ఉంగుటురు, చాట్రాయి, నందివాడా, పెనమలూరు-1, సమతానగర్, క్రుతివేను, చందర్లపాడు-1, వీరంకి, భద్రిరాజుపాలెం, కోరుకోల్లూ-2, పునాదిపాడు-2, 55-కంసలిపేట, 32 లోటస్ ల్యాండ్ మార్క్, 41 పటమాట లంక, 49 హిమావతి కలయనమండపం ప్రాంతం మునుకుల్లా -1, బాపుజి నగర్-1, బేతవోలు-1, బంటుమల్లి రోడ్డు సచివాలయాలో రెండో విడతలో ఆధార్ సేవలు అందించబడతాయన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …