Breaking News

ఇంతవరకు 3.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు…

-జెసి డా. కె. మాధవీలత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లాల రబీ ధాన్యం కొనుగోలు భాగంగా ఇంతవరకు 33,619 రైతుల నుంచి 3,87,655 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత తెలిపారు. శనివారం నగరంలోని జెసి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన డయల్ యువర్ జెసిలో ధాన్యం కొనుగోలు సంబంధించి 17మంది రైతులు తెలిపిన సమస్యలను జెసి మాధవీలత తెలుసుకొని వాటిని నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జెసి మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 33,619మంది రైతుల నుంచి రూ. 675.89 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇందులో ఇప్పటికే రూ. 344.82 కోట్లను రైతులకు చెల్లించగా మరో రూ. 331 కోట్లను రైతులకు చెల్లించేందుకు అమోదించడం జరిగిందని త్వరలో సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయబడుతుందన్నారు. రైతులందరు తాము పండించిన రబీ ధాన్యమును ఇంకనూ విక్రయించవలసి యున్న యెడల ఈనెల జూలై 25 లోగా సత్వరమే సంబంధిత రైతు భరోసా కేంద్రాలలో తమ ధాన్యమును విక్రయించవలసిందిగా జెసి కోరారు. చాట్రాయి మండలం విజయవాడ రూరల్, గన్నవరం, మచిలీపట్నం, జగ్గయ్యపేట, తోట్లవల్లూరు, జి. కొండూరు, కంకిపాడు, ముదినేపల్లి, పెనుగంచిప్రోలు మండలాల నుంచి పలువురు రైతులు మాట్లాడుతూ తాము విక్రయించిన ధాన్యానికి వెంటనే నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోమని కోరారు. దీనిపై జేసి స్పందిస్తూ త్వరలోనే సంబంధిత సొమ్ము జమ చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ కె.రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *