కోవిడ్-19 దృష్ట్యా ఈద్-ఉల్-అజ్జ (బక్రీద్) ప్రార్థన సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించండి… : కలెక్టర్ జె.నివాస్

-వక్స్ సంస్థలు ( మసీదు, ఈద్గా, దర్గా ) మేనేజ్ మెంట్ వారు విధిగా జాగ్రత్తలు తీసుకోండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్-19 దృష్ట్యా బక్రీద్ పండుగా ప్రార్థన సమయంలో పాటించవలసిన పలు సూచనలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఒక ప్రటకన విడుదల చేశారు. బక్రీద్ 2021 ప్రార్థనలు ఈద్గాలలో లేదా బహిరంగ ప్రదేశాలలో నిర్వహించరాదన్నారు. మసీదుల్లో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. మసీదులో 50 శాతం ముసలీలు ( భక్తులు) మాత్రమే ప్రార్థన చేసుకోవాలన్నారు. ప్రార్థన చేసే వ్యక్తు మధ్య కనీసం 6 అడుగుల దూరం పాటించాలన్నారు. మాస్కు ఉన్నవారిని మాత్రమే మసీదులోనికి అనుమతించాలన్నారు. మసీదు ప్రవేశ, నిష్క్రమణ ద్వారం వద్ద సంబంధిత మసీదు మేనేజిమెంట్ వారు శానిటైజర్, లేదా సబ్బును విధిగా ఏర్పాటు చేయలన్నారు. పండుగా సందర్భంగా ఇచ్చే ప్రసంగాలను తక్కువ వ్వవదిలో ముగించవలసిందిగా మసీదు ఇమామ్ లను, ఖతిభులను అభ్యర్థించలన్నారు. చిన్నపిల్లలు, 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు నమాజ్ ను తమ ఇళ్ళల్లోనే చేసుకోవాలన్నారు. మధుమేహం, అధిక బిపి ఇతర ధీర్ఘకాలిక గుండె జబ్బులతో బాధపడుతున్న ప్రజలు తమ ఇళ్లలో మాత్రమే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా బంధువులు ఈద్ మిలాప్ కార్యక్రమాలు, హ్యాండ్ షేకింగ్ (ముసాఫా) ఒకరినొకరు కౌగిలించుకోవడం మొదలైన వాటికి దూరంగా వుండాలన్నారు. కబేళాల్లో విక్రయ దార్లు, కొనుగోలు దారులు తప్పనిసరిగా మాస్క్ ధరించలన్నారు. క్యూ పాటిస్తూ తప్పనిసరిగా 6 అడుగుల దూరం పాటించాలన్నారు. కబేళాల్లో కోవిడ్ నిబంధలను అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధి అధికారులను కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. ఖుర్బాని మాంసం పంపకాల సమయంలో ప్రజలు గుంపులుగా వుండరాదని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పంపకాలు చేయాలన్నారు.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *