విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం కె.తాడేపల్లి అంభపురం సచివాలయాలను శనివారం సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాయంలోని సిబ్బంది ప్రజలకు అందుబాటులో వుంటూ వారికి మెరిగైన సేవందించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచడంతోపాటు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవల వివరాలను పోస్టర్ల ద్వారా తెలియజేయాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే వాల్ పోస్టర్లను, బోర్డులను సచివాలయంలో అందుబాటులో వుంచింది లేనిది ఆయన పరిశీలించారు. ప్రజలు తిలకించేలా ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది గ్రామంలోని ప్రజలకు కోవిడ్ నివారణ సూచనలు, వ్యాక్సిన్ వేసుకునేలా అవగాహన పరచాలన్నారు. గ్రామంలో పెన్షన్లు, రేషన్ పంపిణీ తీరును సచివాలయ సిబ్బందిని ఆరా తీశారు. ప్రతి వారం సోమ,మంగళ, బుధవారంలో కోవిడ్ నియంత్రణ చర్యలపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టార్లను ఆయన పరిశీలించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై సంబంధిత సిబ్బందితో సమీక్షించారు. ప్రజలకు సేవలందించడంలో ఏ ఒక్కరూ కూడా జాప్యం , నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …