గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ, శాస్త్రీయ పద్దతిలో వ్యర్ధాల నిర్వహణ చేయడానికి, ప్రజారోగ్య కార్మికుల సంక్షేమానికి జిఎంసి కృషి చేస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. శనివారం స్థానిక బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో గుంటూరు నగరపాలక సంస్థ ఇంటింటి చెత్త సేకరణ కోసం సిద్దం చేసిన పుష్ కాట్స్, డంపర్ బిన్లు, ఈ-ఆటోలను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎంఎల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ లతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. నగరంలోని 2.80 లక్షల ఇళ్ల నుండి 8 వందల మైక్రో పాకెట్స్ ద్వారా నూరు శాతం చెత్త సేకరణకు జిఎంసి అధికారులు ప్రణాళిక సిద్దం చేశారని, అందులో భాగంగా శనివారం 100 పుష్ కాట్స్, 8 వందలు బిన్లను, 30 పెద్ద కాంపాక్టర్ బిన్లను కమిషనర్ సిద్దం చేయించారని, త్వరలో 19 ట్రాక్టర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే గుంటూరు నగరంలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కన్నా ముందుగా పాట్ హోల్స్ ని గుర్తించామని, అందులో షుమారు 16 వందలు మరమత్తులు పూర్తి చేశారని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి కూడా జిఎంసి ప్రత్యేక కృషి చేస్తుందని, ఇప్పటికే పిఎఫ్, ఆధార్ సీడింగ్, బ్యాంక్ ద్వారా రుణాల మంజూరుకి చర్యలు తీసుకున్నామన్నారు. నగరాభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న నగర కమిషనర్, ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామన్నారు.
కమిషనర్ పులి శ్రీనివాసులు రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకంలో గుంటూరు నగరాభివృద్ధికి, ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా అందెందుకు కృషి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ విభాగాల పనితీరుని మెరుగు చేసుకున్నామన్నారు. గుంటూరు నగరాన్ని స్వచ్చ నగరంగా మార్చుకోవడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తామన్నారు. డిశంబర్ 10 నాటికి నగరంలో వెండింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే పలు ప్రాంతాలో జోన్లను గుర్తించామని, వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డ్ ల ప్రక్రియ జరుగుతుందన్నారు. జిఎంసి వెబ్ సైట్, డ్యాష్ బోర్డ్ ల ఏర్పాటుకు కూడా వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎంఎల్ఏ గల్లా మాధవి మాట్లాడుతూ క్లీన్, గ్రీన్, హేల్తీ గుంటూరు సాధనకు గత 5 నెలల కాలంలో అధికారులు, ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. నగరంలో చెత్త సేకరణ, డ్రైన్ల లో పూడిక, ఖాళీ స్థలాల సమస్యలు అధికంగా ఉన్నాయని, దశల వారీగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనర్ గారు చెప్పిన విధంగా నవంబర్ నెలాఖరుకు పుష్ కాట్స్, డంపర్ బిన్లు, ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చారన్నారు.
ఎంఎల్ఏ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ గతంలో చెత్త సేకరణ కోసం జిఎంసికి కేటాయించిన ఈ-ఆటోలను సక్రమంగా నిర్వహణ చేయలేదన్నారు. ప్రజలకు జవాబుదారీతనంతో మెరుగైన సేవలు అందేలా అధికారులు కృషి చేయాలని, వారికి ప్రజా ప్రతినిధుల నుండి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, అదనపు కమిషనర్ సిహెచ్.ఓబులేసు, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, డిప్యూటీ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, కార్పొరేటర్లు ఈ.వరప్రసాద్, కె.కోటేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ రాజేష్, ఎం.ఇమ్మాన్యేల్(మ్యానీ), గంటా పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …