గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు నూతన గుర్తింపు కార్డ్ ల దరఖాస్తులు స్వీకరణకు డిశంబర్ 5 వ తేదీతో గడువు ముగుస్తుందని, జిఎంసి నూతనంగా ఇచ్చే కార్డ్ లే ప్రామాణికమని కనుక నగరంలోని ప్రతి వీధి వ్యాపారి నగరపాలక సంస్థ ప్రధాన, సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వీధి వ్యాపారులు పాత గుర్తింపు కార్డ్ లు ఉన్నాయని, ప్రస్తుతం దరఖాస్తు చేయడంలేదని తమ దృష్టికి వచ్చిందని, నూతనంగా కేటాయించే కార్డ్ ల ప్రకారం వెండింగ్ జోన్లలో స్థల కేటాయింపు జరుగుతుందన్నారు. కావున పాత గుర్తింపు కార్డ్ కల్గి ఉన్నవారు కూడా నూతన గుర్తింపు కార్డ్ కోసం విధిగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటుగా అందరూ వ్యక్తిగత ఫోటో (వ్యాపారం చేయుచున్న పాస్ పోర్ట్ ఫోటో), కుటుంబ సభ్యుల ఫోటో (14 సంవత్సరాలు మించిన వారు మాత్రమె), డిక్లరేషన్ పత్రం, నివాసపత్ర ఆధారం, గతంలో స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డు నకలు , నగర పాలక సంస్థ జారీ చేసి గుర్తింపు కార్డు నకలు, ఆధార్ కార్డు, అర్జీదారుని ఫోన్ నెంబర్, బ్యాంకు ఎకౌంటు నకలు తదితర గుర్తింపు పత్రాలను జత పరిచాలన్నారు. కేటాయించిన గుర్తింపు కార్డ్ ల ప్రామాణికంతో వారు నిర్వహించే వ్యాపారాల మేరకు జిఎంసి ఏర్పాటు చేయనున్న వెండింగ్ జోన్లలో స్థల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
Tags guntur
Check Also
జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …