Breaking News

పేద ప్రజల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల పక్షాన నిలబడి వారి ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, మాటమీద నిలబడే మంచి ప్రభుత్వమని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం నగరంలోని 46 వ డివిజన్ నారాయణపురం శ్రీ కోదండ రామాలయం వద్ద రాష్ట్ర మంత్రి కొలు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరిలతో కలిసి పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేశారు. మంత్రివర్యులు పింఛన్దారులతో మమేకమై వారి యోగక్షేమాలను ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పింఛన్దారులు కూడా ఎంతో అభిమానంగా మంత్రితో ముచ్చటించారు

తొలుత ఆ వీధిలో శ్రీ భగీరథ మహర్షి చిత్రపటానికి వారు పూజలుచేసి టెంకాయలు కొట్టారు. అనంతరం వారు శ్రీ కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పేదల పక్షాన నిలబడి పనిచేసే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని అన్నారు. జూన్ నెలలో ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఏప్రిల్,మే, జూన్ నెలలో పెంచిన వేయి రూపాయల పింఛను కలుపుకొని మొత్తం 7 వేల రూపాయలు జూలైలో అందజేసిన మంచి ప్రభుత్వం అన్నారు. వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు 4వేల రూపాయలు చొప్పున, దివ్యాంగులకు 6000 రూపాయలకు , మూత్రపిండం, ఎయిడ్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి 10వేల రూపాయలు చొప్పున, నూరు శాతం అంగవైకల్యంతో మంచానికే పరిమితమైన దివ్యాంగులకు 15 వేల రూపాయలు చొప్పున పింఛనును అందజేస్తున్నామన్నారు.

డిసెంబర్ ఒకటో తేదీన సెలవు దినం కావడంతో పింఛను లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరోజు ముందుగానే శనివారం పింఛన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుండే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైందని, 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఉదయం పది గంటల సమయానికి 80% పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా జిల్లాలో 2.70 లక్షల మందికి 80 శాతం పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని మచిలీపట్నం నియోజకవర్గంలో సుమారు 30,500 మందికి పింఛన్లు 78% మేరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. భారతదేశంలో ఎక్కడ అమలులో లేని విధంగా అత్యధికంగా నెలకు 4 వేల రూపాయల పింఛను ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదని, ఆ ఘనత మన రాష్ట్రానికి దక్కింది అన్నారు
ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని, సూపర్ సిక్స్ లో భాగంగా దీపావళి నాడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. అలాగే రైతుల ఇబ్బందులను తీర్చే విధంగా డబ్బులు అందజేస్తున్నా అన్ని విధాల ఆదుకుంటూ ఉందన్నారు. ఈ విషయం ప్రజలందరూ అర్థం చేసుకోవాలన్నారు. అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజల ఆకలిని తీరుస్తున్నామన్నారు. పింఛను లబ్ధిదారులు వరుసగా రెండు నెలలు పింఛను ఏదో కొన్ని కారణాల వలన తీసుకోకపోయినప్పటికీ ఆ పించను రద్దు కాదని, మూడవ నెలలో మొత్తం మూడు నెలల పింఛను లబ్ధిదారులు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజలను ఎంతగానో ఆదుకుంటుందన్నారు. పేదలు పింఛన్ కోసం కార్యాలయం కార్యాలయాలు తినకుండా చుట్టూ తిరగకుండా వారి ఇంటి వద్దకే పింఛను అందించే బృహత్తర కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు.

మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ సామాజిక భద్రత పింఛన్లు అందజేస్తుందన్నారు. దాదాపు 60 లక్షల మందికి పైబడి పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఈ విధంగా పింఛన్లు పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు. వేలకోట్ల రూపాయల భారం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ శక్తి వంచన లేకుండా సూపర్ సిక్స్ లోని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. దీపావళి నాడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించామన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బాపిరాజు, 46 వ వార్డు సచివాలయ కార్యదర్శులు డాక్టర్ శివమణి,శిరీష, రాజేంద్ర శ్రీనివాసరావు స్థానిక ప్రముఖులు బండి రామకృష్ణ తదితర అధికారులు, అనధికారులు ప్రజలు పాల్గొన్నారు.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *