రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ వారి అదేశములను అనుసరించి, ఛైతన్య కస్యప్ పౌండేషన్ వారు 08.12.2024 నాడు క్రీడా భారతి అవార్డు కొరకు 4 వ ఆన్ లైన్ లో క్రీడా జ్ఞాన పరిక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ది అధికారి డి.ఎం.ఎం.శేషగిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలో భాగముగా 12 సం.లు & పై బడిన వయసు గల క్రీడాకారులు, విధ్యార్ధులు, తల్లితండ్రులు, పౌరుల నుండి పెద్ద ఎత్తున Online లో వ్యక్తిగత, Bulk (Excel File) రిజిస్ట్రేషన్ లు చేసుకోవలసిందిగా కోరడమైనది. ఈ ఆన్ లైన్ పరిక్షలో పాల్గొనట నిమిత్తము వెబ్సైట్ http://kreedaabharati.org/ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుందన్నారు.
పరిక్ష తేది : 08.12.2024
లాగ్ ఇన్ సమయం : ఉదయం 5 గంటల నుండి సాయంత్రము 5 గంటల వరకు
పరీక్ష సమయం: 25 నిమిషాలు
మొత్తము ప్రశ్నలు : 5
అర్హత : 12 సంత్సరములు & పై బడిన వారు
చానల్ : కంప్యూటర్, లాప్ టాప్, టాబ్లెట్ మరియు మొబైల్
స్పోర్ట్స్ ఎవెర్నెస్స్ కొరకు డొనేషన్ : రూ.20 లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఈ ఆన్ లైన్ క్రీడా పరిక్షలో మొదట అవార్డు. ఒకరికి : రూ.1 లక్ష
2 వ అవార్డు (ఇద్దరికి) : రూ. 50 వేలు చొప్పున
3 వ అవార్డు (6 గురికి) : రూ. 25 వేలు చొప్పున
4 వ అవార్డు ( 11 మందికి) : రూ.11 వేలు
చొప్పునని తెలిపినారు.
ఇతర వివరములకు వెబ్ సైట్ http:// kreedaabharati.org/ ను సందర్శించవలెను.
ఈ సమాచారం తూర్పు గోదావరి జిల్లా మొత్తము ప్రచురణ కాబడిన విధముగా కోరడమైనది.