-ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని, రీ ఓపెన్ కారాదు.
-ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు నుంచి126 అర్జీలను స్వీకరించాం..
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ పి. ప్రశాంతి 126 అర్జీలను జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, వీఆర్వో సీతారామమూర్తి తో కలసి స్వీకరించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారం వారం సమీక్షిస్తున్నారన్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్, పంచాయితీ రాజ్ శాఖలకు సంబంధించి ఎక్కువగా అర్జీలు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. అర్జీదారుల సమస్యలకు నాణ్యతతో కూడిన విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితిల్లో అర్జీలు పెండింగ్ ఉండరాదని, రీ ఓపెన్ కారాదని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ కు జిల్లా అధికారులు వచ్చే ముందు శాఖా పరంగా పెండింగులో ఉన్న అర్జీల వివరాలను నివేదిక రూపంలో అందింస్తే వాటిని ఎందుకు పరిష్కరించలేదన్న అంశంపై ర్యాండమ్ వారి సమీక్షించడం జరుగుతుందన్నారు.
డిసెంబర్ 5వ తేదీ ఉమ్మడి తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యుల పోలింగ్ ప్రక్రియకు అన్ని మండల కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. అదే రోజు (డిసెంబర్ 5వ తేదీన) జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించే నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులు సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలన్నారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ, స్కిల్ డెవలప్మెంట్, పశుగణన, పి ఎం ఈ వై 2.0 , లబ్ధిదారులు గుర్తింపు వంటి సర్వేలు నిర్వహించడం జరుగుతుందని మండల స్థాయి అధికారులు అందరూ ఆయా మండలాల్లోనే అందుబాటులో ఉండి కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజలు నుంచి126 అర్జీలను స్వీకరించామన్నారు. ఇందులో ఆన్ లైన్ ద్వారా125 ఆఫ్ లైన్ ద్వారా ఒక్క అర్జీ వచ్చాయన్నారు. ఆయా శాఖల వారి వచ్చిన అర్జీల వివరాలు:-
రెవెన్యూ..62, పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి.. 13,హోమ్..16,
వ్యవసాయం మరియు సహకారం..9,
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్..9, జల వనరులు..6, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లు శాఖ..3, ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం.3, పరిశ్రమలు మరియు వాణిజ్యం.1,
హౌసింగ్..1, పశుసంవర్ధక శాఖ..1, మానవ వనరులు (ఉన్నత విద్య)..1 మొత్తం 126 అర్జీలు రావడం జరిగిందని పేర్కొన్నారు.
జిల్లాలో పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీలలో కొన్ని అర్జీల వివరాలు…
నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన ఎం. యశస్విని తమ అర్జీలో మా నాన్నగారికి సంబంధించిన ఆస్తివాటా క్రింద ఇల్లు మరియు 20 సెంట్లు భూమి ఉందని, మా వాటా మాకు ఇవ్వకుండా మా పెద్దనాన్న గారి అనుభవిస్తున్నారని, కావున అధికారులు తగు న్యాయం చేయాలని అర్జీ ద్వారా కోరారు.
రాజమహేంద్రవరం తిలక్ రోడ్డు లో నివసిస్తున్న కందుల హిమగిరి కుమారి తమ అర్జీలో తమ భూమికి సంబంధించి ఈసీలో పేరు సర్వే నెంబరు తప్పుగా నమోదు అవ్వడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కావున సరి చేయించవలసిందిగా వారు అర్జీలో కోరారు.
నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన పిన్నమరాజు కృష్ణంరాజు తమ అర్జీలో తన భార్య పేరు మీద ఉన్న 3.84 ఎకరాల్లో 24 సెంట్లు భూమి కనిపించడం లేదని ప్రభుత్వ డివిజనల్ సర్వేరు తో సర్వే చేయించి తగు న్యాయం చేయాలని కోరారు.
అనపర్తి మండలం గాంధీనగర్ నివాసి వీరలక్ష్మి సుజాత తమ అర్జీలో గతంలో మంజూరు చేసిన ఇంటి స్థలాన్ని ఇప్పించాలనిఅర్జీ ద్వారా వారు కోరారు.
ఈ కార్యక్రంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు,డిఆర్ఓ టి. సీతారామమూర్తి, సిపి ఓ ఎల్. అప్పలకొండ, జిల్లా సహకార అధికారి శ్రీరాములు నాయుడు,.జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు,జిల్లా పశుసంవర్ధక శాఖధికారి శ్రీనివాసరావు, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ఏ. దుర్గెష్, జిల్లా హార్టికల్చర్ అధికారి బి . సుజాత కుమారి, డిఆర్డిఎ పిడి ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్ బి వి రెడ్డి,
డి ఎల్ డి ఓ వీణా దేవి, డీఎస్ఓ కె వి ఎస్ ఎన్ ప్రసాద్, జిల్లా పరిశ్రమల అధికారి జి. రవిశంకర్, డి ఎమ్ సీ ఎస్ టి. రాధిక, ఇంఛార్జి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎమ్. నాగలత, పరిశ్రమల సహయ సంచాలకులు ప్రదీప్ కుమార్, డి ఎంహెచ్ఓ డా. కె. వెంకటేశ్వరరావు, డిసిహెచ్ ఓ డా. పద్మశ్రీ, డిఇ ఓ క్. వాసుదేవరావు, జిల్లా గిరిజన ఎస్ఎసంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News