విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి అని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణ తో పాటు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజుల విన్యాసాలతో విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు బయలు దేరి, అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బోనాల ఉత్సవ కమిటి దేవాలయం ఈవో,ఆలయ కమిటి చైర్మన్ లతో పాటు అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
క్రీడలను ప్రోత్సహిస్తూ తెనాలిలో సువిశాల క్రీడా మైదానం
-గ్రామీణ ప్రాంత రోడ్లు అభివృద్ధికి రూ 25 కోట్లు మంజూరు -రూ. మూడు కోట్ల అంచనాతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ …