Breaking News

మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా పనిచేస్తా

-నా జీవితం మైనార్టీ కుటుంబాలకు అంకితం
-మీ ఆదరాభిమానాలే నన్నుఈ స్థాయికి చేర్చాయి
-అర్హులైన మైనార్టీలకు పథకాలు అందిస్తా
-మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్, చైర్మన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేను ఈ స్థాయికి రావడానికి కారణం మీ అందరి ఆదరాభిమానాలే కారణమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. తుమ్మలపల్లి కళా క్షేత్రం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ మైనారిటీల ఆత్మ బంధువు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.. మైనార్టీల సంక్షేమం, అభివృద్ది ధ్యేయంగా అనునిత్యం ముఖ్యమంత్రి అప్పజెప్పిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. నా తల్లిదండ్రుల ప్రార్ధనలు, అల్లా దీవెనలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయన్నారు. నేను మదరాసా లో చదువుకున్నానని, గత ప్రభుత్వం మదరాసాలను నిర్వహణను సరిగా నిర్వహించలేదన్నారు.
మా అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలను దేవుడి దయతో పాటిస్తున్నానన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ద్వారా నేను మైనార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రభుత్వం అందించే పథకాలను అందిస్తానన్నారు. అర్హులకు తప్పకుండా పథకాలకు దక్కుతాయని, నా జీవితం పేద మైనార్టీ కుటుంబాలకు అంకితమన్నారు. అంతేకాకుండా లబ్ధిదారులను గుర్తించడానికి అవసరమైతే నేనే వారి దగ్గరకు వచ్చి వారికి తగు న్యాయం చేస్తానన్నారు. నాకు చైర్మన్ పదవిని ఇచ్చిన ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. మంత్రి లోకేష్ స్పూర్తిగా.. ఇప్పటి నుండి నన్ను కలవటానికి వచ్చేవారు బొకేలు, షాలువాలు కాకుండా పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ తెస్తే వాటిని తీసుకెళ్లి మంత్రికి అందిస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు మహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఆయన శ్రమే ఆయనకు చైర్మన్ పదవి రావడానికి కారణమైందన్నారు. నిజాయితీకి పట్టం కట్టేలాగా రాజకీయాలు ప్రక్షాళన జరగాలని ముస్తాక్ అహ్మద్ బలంగా నమ్ముతారన్నారు. రాష్ట్రంలోని 70 కి పైగా శాసనసభ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారన్నారు. మైనార్టీల్లోని పేదరికాన్ని దూరం చేయడానికి కృషి చేయాలన్నారు. మొదటిసారి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మైనార్టీల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ను కోటి రూపాయలతో ఏర్పాటు చేశారన్నారు. మైనార్టీలకు సబ్సిడీలతో పథకాలు, వడ్డీలేని రుణాలు అందించాలన్నారు. స్వయం ఉపాధి కోసం మైనార్టీ మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ తదితర కోర్సుల్లో శిక్షణ అందించాలన్నారు.
శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ మాట్లాడుతూ మైనార్టీల కోసం ప్రత్యేక శ్రద్ధ కనపరచిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరేనన్నారు. ముఖ్యమంత్రి మైనార్టీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తారన్నారు. నేను పార్లమెంటు సభ్యునిగా పనిచేసిన కాలంలో కూడా ముస్లింలకు, క్రిస్టియన్స్ కు అనేక నిధులను అందించానన్నారు.
శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో 164 సీట్లను ప్రజలు అందించారన్నారు. పనిచేసిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమన్నారు. మైనార్టీ నాయకుడిగా ముస్తాక్ అహ్మద్ అనేక అవమానాలు అనుభవించారని అందుకు తగ్గ ఫలితం చైర్మన్ పదవేనన్నారు. మైనార్టీ వర్గాలకు పథకాలు అందించి వారికి చేరువ అయినప్పుడే ముఖ్యమంత్రి ఆశించిన ఫలితం నెరవేరుతుందన్నారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా మాట్లాడుతూ ఇస్లాం అంటే సమానత్వం అని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న మైనార్టీలు అందరూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వెంటే నిలబడ్డారన్నారు. ముస్లిమ్ ల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసారన్నారు. ముస్లిం మైనార్టీల మనోభావాలకు రక్షణ కల్పించిన వ్యక్తి ముఖ్యమంత్రి అని అన్నారు.
తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలలు అర్పించారు.. అనంతరం రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ యాకూబ్ చైర్మన్ గా మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.. కార్యక్రమంలో అభిమానులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *