-ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది
-క్రిమినల్ కేసులు నమోదు కు చర్యలు
-జేసి చిన్న రాముడు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం ధోబి ఘాట్ వద్ద 8 బొట్స్, కొవ్వూరు వైపు ఏలినమ్మ ఘాట్ వద్ద 10 బొట్స్ ద్వారా అక్రమంగా ఇసుక ను తరలిస్తున్న బోట్స్ ను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మొత్తం 18 బోట్స్ ను సీజ్ చేయడం జరిగింది. .
జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు
రైలు కం రోడ్డు, గ్రామన్ బ్రిడ్జి సమీపంలో ఇసుకను తీయరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ… కొందరు బోట్స్ మెన్ సొసైటీ వారు వారికి కేటాయించిన ప్రదేశాల్లో ఎక్కువుగా నీరు ఉందని సాకు చెబుతు.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్ కం రైలు బ్రిడ్జి, గ్రామన్ బ్రిడ్జి సమీపంలో అక్రమంగా ఇసుక తీసి తరలిస్తున్న 18 బోట్స్ ను సీజన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న బోట్స్ మెన్ సొసైటీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News