మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు అల్ యూసుఫ్ ఎంటర్ప్రైజెస్ సంయుక్త ఆధ్వర్యంలో బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) మరియు పోస్ట్ బిఎస్సి నర్సింగ్ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు సౌదీ అరేబియా దేశం లో గల రీహబిలిటేషన్ సెంటర్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి dr పి. నరేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల యువత15-12-2024 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు18-12-2024 న ప్రీ-అసెస్మెంట్ నిర్వహించబడుతుందని తెలియజేశారు. అర్హత ప్రమాణాలు: జిల్లాలోని 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య గల బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బిఎస్సి నర్సింగ్ చదివి ఉండి ఏదైనా హాస్పిటల్ నందు కనీసం 1.5 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండవలెను. అభ్యర్థులు సౌదీ అరేబియా దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫీజు: 37,500+GST, ఎంపికైన అభ్యర్థుల యొక్క వీసా ఫీజు, మరియు రాను పోను విమాన టిక్కెట్లు అల్ యూసుఫ్ ఎంటర్ప్రైజెస్ వారు మీరు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజు నుంచే చెల్లిస్తారు.
జీతం : ఇంటర్వ్యూలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు జీతం(భారత కరెన్సీ లో సుమారు ₹78,000 నుండి ₹89,000 వరకు)
కావలసిన పత్రాలు: బయోడేటా, విద్యా సర్టిఫికేట్లు, పాస్పోర్ట్, ట్రాన్స్క్రిప్ట్ సర్టిఫికెట్, జననం ధృవీకరణ పత్రం, అనుభవ సర్టిఫికెట్, వివాహ ధృవీకరణ పత్రం, నోటరీ లెటర్, నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికెట్, కోవిడ్ మరియు MMR సర్టిఫికెట్
ఎంపిక ప్రక్రియ: నర్సింగ్ పరిజ్ఞానం, ప్రాథమిక ఇంగ్లీష్ మరియు డిజిటల్ నైపుణ్యాలు లో ప్రాథమిక పరీక్ష ఉంటుంది. ప్రాథమిక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.
రిజిస్ట్రేషన్ కొరకు కింది లింక్ ను క్లిక్ చేయండి. https://forms.gle/XoY8SHAdaZCtugb1A మరియు క్రింద సూచించిన ఈమెయిల్ కు రెస్యూమ్ పంపించాలి. skillinternational@apssdc.in.
మీ సందేహాలకు దయచేసి 88017 15083 నంబర్న్ సంప్రదించవచ్చని తెలిపారు.