విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వక్ఫ్ బోర్డు భూములను సిబిఐ చేత విచారణ చేసి అన్యా క్రాంత భూముల ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేదలకు పంచాలనీ బుధవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమిటీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని, రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎన్నికలు 245 మంది ముత్తవల్లీలు, కార్యదర్శు లు, మెంబర్లుగా ఉంటారు. అయినప్పటికీ ఎన్నిక లు నిర్వహించకుండా ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించడం సరైన పద్ధతి కాదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ట్రిబ్యునరీ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న అధికారులను ప్రక్షాళన చేయాలి. ఆంధ్ర రాష్ట్రంలో 70 వేల ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ భూముల పై కమిషన్ ఏర్పాటు చేసి అన్యాకాంతమైన భూము లను ప్రభుత్వం స్వాధీ నం చేసుకొని నిరుపేద ముస్లింలకు మూడు సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ముస్లింల ను కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ముస్లింలకు అనేక హామీలు ఇచ్చారు. ఉర్దూ అకాడమీ మైనార్టీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించలేదు. ప్రతి గ్రామంలో షాదీ ఖానా లకు స్థలం కేటాయించి ప్రభుత్వమే నిర్మాణం చేయాలని, ముస్లింలకు దుల్హన్ పథకాన్ని అమలు చేసి లక్ష రూపాయలు ఇవ్వాలని, వృద్ధులకు వితంతువులకు కొత్త పెన్షన్ అమలు చేయాల ని. ముస్లిం కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్లు రూపాయలు బడ్జెట్ కేటాయించాలని అన్నారు. అమరావతి రాజధానిలో జుమ్మా మసీద్ కొరకు 100 ఎకరాలు స్థలాన్ని కేటాయించాలని దానికి అయ్యే ఖర్చు ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ నిధులను సమకూరు స్తుందని అన్నారు. ఎన్నికలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని నిలబెట్టుకోవా లని అన్నారు. ఈ సమావేశంలో జాకీర్ హుస్సేన్, సయ్యద్ సైదా, గుర్రం రామారావు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …