Breaking News

ప్రభుత్వ పెన్షన్ దారులకు విజ్ఞప్తి

-2025 జనవరి ఒకటో తేదీ తదుపరి మాత్రమే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి
-జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగము చేసి రిటైర్ అయిన ఫించనుదార్లు మరియు కుటుంబ ఫించనుదార్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన తమ తమ లైఫ్ సర్టిఫికేట్ ( వార్షిక ధృవీకరణ ప్రమాణపత్రం ) 2025 జనవరి ఒకటో తేదీ తరువాత మాత్రమే సమర్పించాల్సి ఉంటుందనీ తూ.గో.జిల్లా ఖజానా అధికారి ఎన్. సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొందరు పెన్షన్ల దారులు అవగాహన లేక ముందుగా లైఫ్ సర్టిఫికెట్ అందచేస్తున్న విషయం పై తెలియ చేయునది ఏమనగా జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసిన వాటినే పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 31 లోగా అందించవద్దని విజ్ఞప్తి చేశారు.

జనవరి ఒకటో తేదీ తరువాత లైఫ్ సర్టిఫికేట్ ను జీవన్ ప్రమాణ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించాలని, ఆధార్ సంఖ్య ఆధారంగా బయో మెట్రిక్ గుర్తింపు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓ టీ పి తో కూడి లైఫ్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంటుందన్నారు. వ్యయ ప్రయాసలకోర్చి ట్రెజరీ కి వెళ్ళవలసిన అవసరం లేదన్నారు. 2025 కి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ జనవరి 1 2025 తర్వాత మాత్రమే సమర్పించాలని, జనవరి 1, 2025 కి ముందు గా సమర్పించిన వాటిని పరిగణలోకి తీసుకోవడం జరగదు. ఈ విషయాన్నీ ప్రభుత్వ పెన్షన్ల దారులు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రభుత్వ ఫించనుదారులు అందరూ గమనించగలరని కోరియున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్స్ *జనవరి 2025 1వ తేదీ నుండి ఫిబ్రవరి 2025, 28 తేదీ వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా “సిఎఫ్ఎమ్ఎస్” లో పెన్షనర్ సొంత లాగిన్ ద్వారా లేదా “ఎన్ఐసి – జీవన్ ప్రామాణ్” ద్వారాలో సబ్మిట్ చేయాలన్నారు. పొరపాటున నవంబరు 2024, డిశంబరు 2024 నెలల్లో జీవిత ధృవీకరణ పత్రం ఇచ్చిన యెడల పరిగణలోనికి తీసుకొవడం జరగదన్నారు. జనవరి-2025 లేదా ఫిబ్రవరి-2025 లో తిరిగి ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 28 లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని యెడల, ఆన్లైన్ లో అప్లోడ్ చెయ్యని యెడల 2025 ఏప్రిల్ నుండి పెన్షన్ నిలుపుదల అవుతుందన్నారు ఈవిషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదవీ విరమణ, ఫ్యామిలీ పెన్షన్లు పొందుతున్న పెన్షనర్లు ముఖ్యంగా గ్రహించాలి.

Check Also

అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *