Breaking News

నేటి (గురువారం) నుంచి న్యూ ఢిల్లీ కి నేరుగా విమాన సర్వీసు

కోరుకొండ (మధురపూడి), నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి విమానాశ్రయం నుండి ఢిల్లీ మహనగరానికి ఇండిగో ఎయిర్ బస్ ఆపరేషన్స్ మొదలు అవుతున్నాయని , కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఆధ్వర్యంలో తోలి సర్వీస్ ను గురువారం ఉదయం ప్రారంభించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కింజరాపు రామ్మోహన్ నాయుడు , రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి , కాకినాడ పార్లమెంట్ సభ్యులు, తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ , రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ముందస్తు ఏర్పాట్లను ఎయిర్పోర్ట్ అథారిటీ, జిల్లా యంత్రాంగం తో కలిసి పర్యవేక్షణ చేసినట్లు చిన్న రాముడు తెలియ చేశారు. తొలి సర్వీస్ గురువారం (12.12.2024) ఉదయం 06:30 గంటలకు న్యూఢిల్లీ నుండి బయలుదేరి ఉదయం 8:45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుతుందని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ (రాజమండ్రి విమానాశ్రయం) ఎస్. జ్ఞానేశ్వర రావు తెలిపారు. తొలి న్యూ ఢిల్లీ కి నేరుగా విమాన సర్వీస్ ఉదయం 9 గంటలకి బయలుదేరి వెళ్లనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి రోజూ డిసెంబర్ 13 నుంచి న్యూ ఢిల్లీ  కి రాజమండ్రి నుంచి నేరుగా” 6 ఈ 364 ” ఇండిగో విమాన సర్వీస్ న్యూ ఢిల్లీ నుంచి ఉదయం 7.30 గంటలకు బయలు దేరి రాజమండ్రీ కి ఉదయం 9.45 కు చేరుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఉదయం 10.30 కు రాజమండ్రి నుంచి బయలుదేరి న్యూ ఢిల్లీ కి మ.1.00 గంటకి చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి, రాజమండ్రీ ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *