గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ ప్రణాళిక అంశాలపై అర్జీలు, ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి శుక్రవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని సిటి ప్లానర్ చాంబర్ లో ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నామని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆదేశాల మేరకు సిటి ప్లానర్ రాంబాబు ఓపెన్ ఫోరం నిర్వహించి, మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి సంబందించిన సమస్యలపై ఫోరంలో అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చన్నారు. ఫోరంలో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబందించిన అధికారులు పాల్గొంటారన్నారు. కనుక నగర ప్రజలు, లైసెన్స్డ్ ఇంజినీర్లు, తమ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఫోరంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు రెహ్మాన్, వెంకటేశ్వర్లు, టిపిఎస్ సత్యనారాయణ, టిపిబిఓలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …