గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ నుండి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేసే నిర్మాణాలను తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు శుక్రవారం నగర పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్, వాసవి నగర్ మెయిన్ రోడ్ లో అనధికార కట్టడాలను పట్టణ ప్రణాలికాధికారులు తొలగించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్లో, వాసవి నగర్ మెయిన్ రోడ్లో జిఎంసి నుండి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేసిన అనధికార కట్టడాలను పట్టణ ప్రణాళిక అధికారులు జెసిబిలతో, పోలీస్ సహకారంతో పూర్తిగా తొలగించారని తెలిపారు. నగరంలో అనధికార కట్టడాల పై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయని, పట్టణ ప్రణాళిక అధికారులు వార్డ్ సచివాలయాల వారీగా వివరాలు తీసుకొని, వాటిని తొలగించడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్నారన్నారు. భవన నిర్మాణదారులు కూడా ప్రభుత్వ నిర్దేశిత చెక్ లిస్టు మేరకు భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేస్తే వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని, తగిన అనుమతులు తీసుకొని నిర్మాణం చేసుకొని నగరపాలక సంస్థకు సహకరించాలని తెలిపారు.
Tags guntur
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …