మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి , విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకువెళ్ళమని త్వరలో పరిష్కార దిశగా చర్యలు వెలువడనున్నట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి సందర్శన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి పేర్ని నాని హడావిడిగా ప్రయాణమయ్యారు. ముందుగా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు వెళ్లి అక్కడ నుంచి ముఖ్యమంత్రితో కలిసి హెలికాఫ్టర్ ద్వారా పోలవరం వెళ్లాల్సి ఉంది. గుంటూరు జిల్లా తాడేపల్లి వెళ్లె ప్రయాణ సమయంలో జియో మీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మచిలీపట్నంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎల్ ఈ డి బిగ్ స్క్రీన్ టీవీ ద్వారా అక్కడకు వచ్చిన పలువురు ప్రజలను ముఖాముఖిగా వీక్షిస్తూ ఎంతో ఓపిగ్గా పలువురితో సంభాషించారు. తొలుత 1998లో క్వాలిఫైడ్ అభ్యర్థులు తమ సమస్యను మంత్రికి తెలిపారు. రెండు దశాబ్దాలుగా ఉద్యోగం కోసం సుదీర్ఘ కాలం నిరీక్షిస్తున్న తమకు పోస్టింగ్లు ఇవ్వలేదని, ఇటీవల 2008 అభ్యర్థులకు టైమ్ స్కేలు మీద ఉద్యోగాలు ఇచ్చారని వారికి ఇచ్చనట్లు తమకు సైతం డి.ఎస్.సి. 1998 అభ్యర్థులకు 4534 మందికి ఉద్యోగాలు ఇవ్వలసిందిగా అభ్యర్ధిస్తున్నట్లు తెలిపారు. అలాగే 1998 లో ఆపరేషన్ బ్లాక్ బోర్డు (ఓ.బి.బి.) పోస్టులను ఇవ్వాలని తద్వారా 23 సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న తమకు న్యాయం చేయాల్సిందిగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్ధులు సాయిరామ్ ప్రసాద్, వంకా వెంకటేశ్వరరావు, సి హెచ్ శ్రీనివాసరావు, ప్రభాకర్, కనకదుర్గ తదితరులు మంత్రిని అభ్యర్ధించారు.
స్థానిక ముస్తఖాన్పేట యానిధుల కాలనీకి చెందిన మార్గాని తాతయ్య మంత్రి పేర్నినానికి తన కష్టాన్ని చెప్పుకొన్నారు. తనకు వృద్ధ్యాప్య పింఛన్ రావడం లేదని తనకు అర్హతలు ఉన్న జాబితాలో తన పేరు ఎందుచేతనో మంజూరు కాలేదని ఆవేదన చెందారు. విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యేవరకు పెద్దాయన నీకు నేను పింఛన్ నేను ఇస్తా బాధపడొద్దని భరోసా ఇచ్చారు.
వైస్సార్ బీమా మిత్రులకు చెందిన పలువురు మహిళలు మంత్రికి తమ ఇబ్బందిని చెప్పుకొన్నారు. బీమా మిత్రుల పని వాలంటీర్లను అప్పగించారని , బీమా మిత్రులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 7 నెలల బకాయిలు పారితోషికాలు చెల్లించాలని, 3 వేలు గౌరవ వేతనం, పారితోషికాలు రెట్టింపు చేస్తామని, ప్రతి క్లెయిమ్ కు 1000 రూపాయలు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆర్ధికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.
తాను 5 వ వార్డు చిలకలపూడి ఎఫ్ సి ఐ గోడౌన్ వద్ద అద్దెకు ఉంటున్నానని తనకు ఇళ్లస్ధలం మంజూరు కాలేదని పువ్వాడ దేవి మహాలక్ష్మి మంత్రికి తెలిపారు.
కరోనా బాధితుడినని ఆ వ్యాధిలో తనకు ఎడమ చేయి , ఎడమ కాలుకు పక్షవాతం వచ్చిందని తనను గుంటూరు జిల్లా వినుకొండ డిపోకు బదిలీ చేయాలనీ అవనిగడ్డ ఆర్టీసీ డిపో మెకానిక్ గా పనిచేసే గుండం బ్రహ్మానందరెడ్డి మంత్రిని అభ్యర్ధించారు.
స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసే పలువురు మంత్రి పేర్ని నానికి తమ ఇబ్బందిని చెప్పుకొన్నారు. జూన్ నెలలో కొత్త కాంట్రాక్టర్ వచ్చారని అప్పటివరకు తమకు నెలకు 6 వేల రూపాయల జీతం ఇస్తూ ఉండేవారని, నూతన కాంట్రాక్టర్ వచ్చేరని ప్రస్తుత దుర్భర పరిస్థితులలో ఆ జీతం తమ కుటుంబ పోషణకు సరిపోవడం లేదని మంత్రికి చెప్పారు.
Tags machilipatnam
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …