ముదినేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు అందించడంతో పాటు విద్యార్థులకు కావలసిన యూనిఫామ్స్, షూ, శానిటేషన్ సామాగ్రి, టేస్ట్ బుక్స్,ఇవ్వడం చాలా సంతోషంగా వుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ముదినేపల్లి మండల ఎంఈవో నగేష్ ఆధ్వర్యంలో మండలంలోని 69 పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు 40 వేల టేస్ట్ బుక్స్,యూనిఫామ్స్ క్లాతులు,పారిశుధ్య వస్తువులు, శానిటేషన్ సామాగ్రి అందచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీయం జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో పేద మధ్య తరగతి విద్యార్థులకు పాఠశాలలో అన్ని రకాల మౌళిక సదుపాయాలు అందించాలని, విద్యార్థులకు కావలసిన యూనిఫామ్స్, షూ, శానిటేషన్ సామాగ్రి , టేస్ట్ బుక్స్,ఇవ్వడం చాలా సంతోషంగా వుంది అని అన్నారు. ముదినేపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 5 వేల మంది పేద, మధ్య తరగతి, విద్యార్థులకు మా చేతుల మీదుగా అందించడం ఆనందదాయకంగా ఉందన్నారు. సీయం జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పపాదయాత్ర లో రాష్టంలో విద్యార్థులు పడుతున్న కష్టాలను నేరుగా చూసి, విని, అధికారంలోకి వచ్చి వెంటనే, విద్యార్థుల విద్యా కోసo విప్లవతమైన మార్పులు తీసుకువచ్చి, డబ్బు వున్న కార్పొరేట్ స్కూలు ఏ రకంగా అయితే ఉన్నాయో, అదేవిదంగా ప్రభుత్వం పాఠశాలలు ఉండాలని, నాడు -నేడు పధకం ప్రవేశపెట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా అభివృద్ధి చేశారన్నారు. అదేవిదంగా 1 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లి అకౌంట్ లో, అమ్మఒడి పధకం ద్వారా 15 వేల రూపాయలు నేరుగా జమ చేస్తున్నారన్నారు. అలాగే జగనన్న గోరుముద్ద పధకం ద్వారా ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం పాఠశాలలో అందే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. పేద వాడు చదువు కోసం ఇబ్బందులు పడకూడదని, విద్యా విధానాలలో అనేక మార్పులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొర్రా శేషుబాబు,రాష్ట్ర కార్యదర్శిలు నిమ్మగడ్డ బిక్షాలు, చేబోయిన వీరాజు,జడ్పీటీసీ అభ్యర్థి ఈడే వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ అభ్యర్థిలు రామిశెట్టి సత్యనారాయణ,పెద్దిరెడ్డి రాము,అడవి కృష్ణ,మండవల్లి మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు, ముంగర మల్లికార్జునరావు,గంట సంధ్య, ఉల్లంకి నగేష్,సాక్షి సాయిబాబు, శీలం రామకృష్ణ, అచ్చుత రాంబాబు, బొమ్మనబోయిన గోకర్ణ, పాతూరి ఆంజనేయులు, రాచూరి కుమార్,కొల్లాటి సత్యనారాయణ, సోమ సత్యనారాయణ, నర్రా వెంకటేశ్వరరావు, బేతపూడి రాజు, బేతపూడి రమణ తదితరులు పాల్గొన్నారు.
