-బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
52వ డివిజన్ బ్రాహ్మణ వీధిలో ఇటివల గుండెపోటుతో మరణించిన నాగినేటి ఉదయశ్రీ (45) కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం అందించారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) ఆదేశాలతో ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది కూటమి నాయకులతో కలిసి ఆదివారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద అయినటువంటి నాగినేటి ఉదయశ్రీ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి చంటి సుజనా దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి కుమారుడికి ఆర్థిక సాయం అందించారు . కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మృతుని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా కు కృతజ్ఞతలు తెలియజేశారు.