విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్ధి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్పులు చేసి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సుజనా చౌదరి నేతృత్వంలో తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు చర్చించిన సుజనా మరో సారి మాస్టర్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించి సలహాలు సూచనలను అందించారు. భవిష్యత్తులో ఎదురయ్యే భక్తుల అవసరాలను పరిగణలోకి తీసుకొని మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జనవరి నాటికి మరింత మెరుగ్గా ప్లాన్ ను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సుజనా ఆదేశించారు.
కార్యక్రమంలో దుర్గగుడి ఈ ఈ వైకుంఠరావు, సిద్ధార్థ కళాశాల డైరెక్టర్ బి పాండురంగారావు,స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ శ్రీనివాసరావు, సుజనా ఫౌండేషన్ ప్రతినిధి బోరా శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్మెస్ బెగ్, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …