విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్రం విజయవాడ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని పటమట హై స్కూల్ నందు విజయ దివాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా 1971లో బంగ్లాదేశ్ కోసం మన భారత సైన్యం పోరాట ప్రతిభను పరాయి దేశం కోసం సైన్యం త్యాగాన్ని ఎలా చేసిందో అనే అంశాలపై విద్యార్థులకు జిల్లా యువ అధికారి సుంకర రాము వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ సి సి ఆఫీసర్ దుర్గారావు మాట్లాడుతూ మన ధైనిందన జీవితంలో ధైర్యంగా స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే దానికి కారణం మన భారత సైన్యం అని 1971లో ఎలా అయితే మన సైన్యం విరోచితంగా పోరాడిందో మీరందరూ తెలుసుకోవాలని విద్యార్థులు రేపటి పౌరులని అగ్ని వీరి పథకాన్ని కూడా అర్థం చేసుకుని సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సీతా రెడ్డి గారు మరియు ప్రోగ్రాం నిర్వాహకులు వినోద్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …