మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సవం సోమవారం విద్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించి స్ఫూర్తిదాయకమైన ప్రభావశీలుర విజయ గాధలు వివరించి విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. ఐఏఎస్ అధికారి జయ గణేశన్ తదితరులు జీవితంలో ఏ విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించారో కలెక్టర్ వివరిస్తూ విద్యార్థులు ఇట్టి వారి నుండి స్ఫూర్తి పొందాలని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఉద్బోధించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ఆసిఫ్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపాల్ విజయకుమార్, ప్రైమరీ సెక్షన్స్ హెచ్ఎం గ్లోరీ స్వరూప రాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం చట్టరీత్యా నేరం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనధికార ట్యాప్, డ్రైనేజి కనెక్షన్లు కల్గి ఉండడం …