-తంధులాభిషేకం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ టౌన్ పాత శివాలయంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి 12,108 కేజీల బియ్యంతో నిర్వహించిన తంధు లాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. భక్తులనుంచి బియ్యాన్ని సేకరించి మూడు రోజులపాటు భక్తిశ్రద్ధలతో అన్నదానం చేశారు. ద్వారావతి ఫౌండేషన్ ఆహ్వానం మేరకు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నాయకులతో కలిసి సోమవారం అభిషేకంలో పాల్గొని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరికి తంధులాభిషేకం నిర్వహించారు. భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ద్వారావతి ఫౌండేషన్ చైర్మన్ గూడెల సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజున కాశి అన్నపూర్ణేశ్వరి దశ జయంతి సందర్భంగా ద్వారావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మవారికి బియ్యంతో తంధు లాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం వన్ టౌన్ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారికి అంగరంగ వైభవంగా అభిషేకం చేయడం సంతోషకరమన్నారు. గత మూడు రోజులుగా శివాలయంలో నిర్వహిస్తున్న అభిషేకాలు, నిత్యాన్నదాన కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ద్వారావతి ఫౌండేషన్ ద్వారా ఇటీవల సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాలలో 1,50,000 మంది బాధితులకు అన్నదానం, మంచినీరు, పాలు మరియు వైద్య సేవలను అందించామన్నారు. కార్యక్రమానికి సహకరించిన పాలకమండలి సభ్యులకు , ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ద్వారావతి ఫౌండేషన్ సభ్యులు గోనె వెంకట సుబ్బారావు , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బోమ్ము మధు, నటరాజన్ షణ్ముగం, గార్లపాటి సూర్యనారాయణ, కూటమి నేతలు పివి చిన్న సుబ్బయ్య, బొల్లాపల్లి కోటేశ్వరరావు, ముదిగొండ శివ, దాడి మురళీకృష్ణ, గురునాథం, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.