Breaking News

సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగాం … : సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై  రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు.  ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ…

సమర్ధ వ్యాక్సినేషన్‌ ద్వారా ఎక్కుమందికి డోసులు
సమర్ధ నిర్వహణ ద్వారా ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామన్న సీఎం  వైయస్‌.జగన్‌
రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన వ్యాక్సిన్‌ డోసులు 1,80,82,390
ఇంకా (బ్యాలెన్స్‌డు డోసులు) వినియోగించాల్సిన డోసులు 8,65,500
ఇప్పటివరకు ఇచ్చిన డోసులు సంఖ్య 1,82,49,851
సమర్ధ నిర్వహణ ద్వారా దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా
ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది
విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌
సమర్ధ నిర్వహణద్వారా ఆదా చేయడం సాధ్యమైంది
45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలి
గడిచిన మే నెల నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్‌ డోసులు 35 లక్షలు
కేవలం సుమారు 4,63,590 డోసులు మాత్రమే వినియోగం
ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయం
గర్భిణీ స్త్రీలకు వాక్సినేషన్‌ కార్యక్రమం చురుగ్గా కొనసాగాలి
వాక్సినేషన్‌పై వారికి ఆవగాహన కలిగించాలి
అధికారులకు స్పష్టం చేసిన సీఎం వైయస్‌.జగన్‌

థర్డ్‌ వేవ్‌ సన్నద్దత
థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలి
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని సూచన
పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలి
కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి
పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలి
సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలి
అప్పుడే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి వస్తారు
కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలి
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు
కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలి
జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయి
సీఎం  వైయస్‌.జగన్‌

ప్రైవేటు ఆసుపత్రులు – ఆక్సిజన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు 
50 పడకలు దాటి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు విషయంలో పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం
జిల్లా కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారన్న అధికారులు
ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్‌ ఇస్తున్నామని స్పష్టం చేసిన సీఎం

కోవిడ్‌ 19 నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్, థర్డ్‌ వేవ్‌ సన్నద్ధతపై సీఎంకు వివరాలందించిన అధికారులు
యాక్టివ్‌ కేసులు 24,708
పాజిటివిటీ రేటు 2.83 శాతం
3 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 8
3 నుంచి 5 మధ్యలో పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 5
రికవరీ రేటు 98.05 శాతం
నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 94.19 శాతం
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 76.07 శాతం
13వ దఫా ఫీవర్‌ సర్వే కూడా పూర్తయింది.
104 కాల్‌ సెంటర్‌కు వస్తున్న రోజువారీ కాల్స్‌ 1000 లోపు

బ్లాక్‌ ఫంగస్‌
తగ్గుముఖం పట్టిన బ్లాక్‌ ఫంగస్‌ కేసులు
గత వారంలో నమోదైన కేసులు 15
మొత్తం కేసులు 4075
చికిత్స పొందుతున్నవారు 863

వ్యాక్సినేషన్‌
మొత్తం వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు 1,41,42,094
సింగిల్‌ డోసు పూర్తయినవారు 1,00,34,337
రెండు డోసులు పూర్తయినవారు 41,07,757

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనిజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *