– 2,36,927 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద రూ.101 కోట్ల 93 లక్షల 56 వేలు మేర పంపిణి
– 9041 క్లస్టర్ ఏరియాలో 5158 మంది పిడివో ల ద్వారా పెన్షన్ పంపిణీ
– కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 2025 నెల ఒకటో పంపిణీ చెయ్యవలసిన 2,36, 927 మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల ను ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 31 న పంపిణి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కొరకు 9041 క్లస్టర్ ఏరియాలో 5158 మంది పిడివో ల ద్వారా ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సగటున ప్రతి పెన్షన్ పంపిణీ అధికారులకి 46 పింఛన్లు పంపిణి చెయ్యడం జరుగుతుందని తెలిపారు. డిసెంబరు 31 వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చెయ్యడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 236927 మందికి 17 కేటగిరిలలో రూ .101, 93,56,000 సంబంధించిన బ్యాంకు బ్రాంచి ద్వారా లబ్దిదారులకు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
మండల వారీగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల దారుల వివరాలు …
అనపర్తి 10231 మంది రూ.43220500, బిక్కవోలు 10557 రూ. 44155000 , చాగల్లు
9296 రూ. 39805000 , దేవరపల్లి 10921 రూ. 46846000 , గోకవరం 10460 రూ 45371500 , గోపాలపురం 9059 రూ.38545500 , కడియం 11836 రూ. 50941000 , కోరుకొండ 12,209 రూ.54211000 , కొవ్వూరు 10083 రూ.43060500 , కొవ్వూరు అర్బన్ 3920 రూ.17271000 , నల్లజర్ల 11446 రూ.48920000 , నిడదవోలు 10374 రూ.44852000 , నిడదవోలు (పట్టణ) 4242 రూ.18739500 , పెరవలి 10249 రూ.43502500 , రాజమండ్రి అర్బన్ 28596 రూ.123906000 , రాజమండ్రి రూరల్ 19691 రూ.85669500 , రాజానగరం 15329 రూ.66598000 , రంగంపేట 8800 రూ.37565500 , సీతానగరం 11472 , రూ.48440500, తాళ్లపూడి 7806 రూ. 33159000 , ఉండ్రాజవరం 10350 మందికి రూ.44576500
జిల్లా వ్యాప్తంగా 11 బ్యాంకులకి చెందిన 71 బ్రాంచీల నుంచి నగదు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి జిల్లాలోని 512 క్లస్టర్ పెన్షన్ పంపిణీ అధికారులు ñల అధర్వ్యంలో పెన్షన్ లబ్దిదారులకు ఇంటి వద్దనే పంపిణి చేయనున్నట్లు డిఆర్డిఎ పిడి ఎన్వివిఎస్ మూర్తి తెలిపారు.