Breaking News

డిసెంబర్ 22 న ఏపీపీఎస్సీ శాఖ పరమైన పరీక్షలు

-కంప్యూటరుపరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
-పరీక్షలకు హాజరుకానున్న 249 మంది ఉద్యోగులు
-డి ఆర్ వో టి సీతారామ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎపిపి ఎస్సీ ద్వారా  శాఖ పరమైన పరీక్షలను డిసెంబర్ 22 ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. శనివారం ఎపిపిఎస్సీ ద్వారా  శాఖా పరమైన పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, కంప్యూటర్ పరిక్ష ను డిసెంబర్ 22 తేదీన ఎపిపి ఎస్సీ ద్వారా నిర్వహిస్తున్నట్లు , పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదే విధంగా  రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హల్ టికెట్ తో పాటు, ప్రభుత్వం గుర్తించి అసలు ఫోటో గుర్తింపు కార్డు తో పరీక్ష ప్రారంభించడానికి అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించవలసి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించడం జరగదని తెలిపారు. పరీక్ష ఉదయం పరీక్ష ఉ.10.00 నుంచి ఉ .12.00  వరకు నిర్వహిస్తామని అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి అనుమతించడం జరుగుతుందని, ఉదయం 9.30 గంటల తరువాత పరీక్షా కేంద్రం లోకి అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. కన్వెన్షనల్ టైప్ పరీక్షలు 10.00 నుంచి ఉ మ.12.00  వరకు నిర్వహిస్తామన్నారు.

పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అనుమతించమని , తనిఖీ చేసే సిబ్బందికి సహకరించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తగిన పోలీసులు సిబ్బందిని నియమించాలని, నగర పాలక సంస్థ సానిటేషన్, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, అత్యవసర మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చెయ్యలని పేర్కొన్నారు.

డిసెంబర్  22 వ తేదీ పరీక్షకు ఉదయం 249 మంది హాజవుతారని ఎపిపిఎస్సీ అధికారులు తెలిపారు. ఇప్పటికే వారం రోజులు ముందే హల్ టికెట్స్ అభ్యర్థులకు విడుదల చేసినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ ఎస్ ఓ జె.యశోద, ఎస్ఐ జి..పరశురామ్, ఎంపిహెచ్ఓకే . సురేష్ బాబు, విద్యుత్ శాఖ డిఈఈ డీ. శ్రీనివాసు , తహసిల్దార్ పి హెచ్ పాపారావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *