గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు రూ.5కే ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో శుచి, శుభ్రతతో ఆహారం అందించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అక్షయపాత్ర, జిఎంసి ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ జెకెసి రోడ్ లోని అన్న క్యాంటీన్, కృష్ణబాబు నగర్, ఎస్వీఎన్ కాలనీ, అడవితక్కెల్లపాడు ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత అన్న క్యాంటీన్ ని పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా లేక పోవడం, సంప్ శుభ్రం చేయకపోవడం, డ్రైన్ బ్లాక్ గమనించి, సంబందింత సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్షయపాత్ర సిబ్బంది స్థానిక జిఎంసి అధికారులతో సమన్వయం చేసుకోవాలని, క్యాంటీన్ కు వచ్చే వారికి మంచి వాతావరణంలో ఆహారం అందించాలన్నారు. ఆహారం తీసుకుంటున్న ప్రజలతో నేరుగా మాట్లాడి ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం కృష్ణబాబు నగర్ లో పర్యటించి, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ అందించాలని, ఎమినిటి కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో ఇంటింటి సర్వే చేసి, అనధికార ట్యాప్ కనెక్షన్లు తొలగించడం, వివిధ కేటగిరీలుగా నూతన కనెక్షన్ల మంజూరు చేయాలని ఆదేశించారు. అడవితక్కెల్లపాడు రోడ్ లో నూతనంగా నిర్మాణం చేసిన సిసి డ్రైన్ ను పరిశీలించి, అనుమతులు లేకుండా డ్రైన్ లో పైప్ లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిఈఈని ఆదేశించారు. ఎస్విఎన్ కాలనీలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన భవనాన్ని పరిశీలించి, జిఎంసి నుండి పొందిన ప్లాన్, సెట్ బ్యాక్ కొలతలను తనిఖీ చేసి, తదుపరి అనుమతులపై పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
పర్యటనలో డిఈఈ వెంకటేశ్వరరావు, ఏసిపి రెహ్మాన్, టిపిఎస్ సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …