-జిల్లా కలెక్టరు జె.నివాసను ప్రత్యేకంగా అభినందించిన రాష్ట్ర మంత్రి శ్రీరంగనాధరాజు
-11 వేల 419 మంది లబ్ధిదారులకు రూ. 56.10 కోట్లు అదనపు రుణం మంజూరు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం సహాయక సంఘంలోని సభ్యుల ఇంటి నిర్మాణానికి అదనంగా రుణం మంజూరు చేసి అందించడంలో రాష్ట్రంలో కృష్ణాజిల్లా ప్రధమస్థానంలో నిలిచిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు చెప్పారు.
స్థానిక ఇరి గేషన్ కాంపౌండ్ లోని రైతు శిక్షణా కేంద్రంలో గురువారం 11 వేల 419 మంది లబ్దిదారులకు రూ. 56.10 కోట్లు అదనపురుణం మంజూరు చెక్కును రాష్ట్ర మంత్రులు పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, పేర్ని వెంకట్రామయ్య (నాని)లతో కలిసి గృహనిర్మాణశాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 19 వేల 833 స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇళ్లు మంజూరు కాగా, రూ. 50 వేలు చొప్పున అదనపు రుణాన్ని ప్రధమంగా 11 వేల 419 మందికి మంజూరు చేయడంలో జిల్లా కలెక్టరు జె. నివాస్ కృషిని రంగనాధరాజు అభినందించారు. డిఆర్ డిఏ ద్వారా 6,310 మందికి మంజూరైన రూ. 31.55 కోట్లు, మెప్మా ద్వారా 1808 మందికి రూ. 8.04 కోట్లు, వియంసి పరిధిలో 3301 మందికి మంజూరైన రూ. 16.50 కోట్ల రూపాయల చెక్కును ఈ సందర్భంగా మహిళలకు అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వవిప్ ఉదయభాను, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, జిల్లా కలెక్టరు జె.నివాస్, ఎమ్మెల్సీ కరీమున్నీసా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత కృష్ణ ప్రసాద్, సింహాద్రి రమేష్, కె. రక్షణనిధి , మేకా వెంకట ప్రతాప అప్పారావు, జాయింట్ కలెక్టర్లు కె. మాధవిలత, నుపూర్ అజయ్ కుమార్ , డిఆర్ డిఏ పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి ప్రకాశరావు, యుసిడి పిడి అరుణ, హౌసింగ్ పిడి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.