Breaking News

క్రమశిక్షణతో చదివి ఉన్నతశిఖరాలను అధిరోహించాలి… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  మల్లాది విష్ణు  అన్నారు. నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జాం స్టేజ్ -2 ఫైనల్స్ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం మారుతీనగర్లోని శ్రీ చైతన్య స్కూల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా తో కలిసి  సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది విష్ణు  మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తోందని చెప్పుకొచ్చారు. కనుకనే అన్ని పోటీ పరీక్షల ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రథమస్థానంలో నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనూ తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు విజయవాడకు వచ్చి శ్రీచైతన్య స్కూల్లో విద్యనభ్యసించడమే ఇందుకు నిదర్శనమన్నారు. తాజాగా నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జాం ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం ప్రశంసనీయమని మల్లాది విష్ణు  అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ లో.. జిల్లా నుంచి 53 మంది విద్యార్థులు అర్హత సాధించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ స్కాలర్ షిప్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జాం ఫలితాలలో మెరిట్ సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలతో సన్మానించారు. విద్యార్థుల విజయానికి కారణమైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ అకడమిక్ డైరక్టర్ శ్రీమతి సీమ, విజయవాడ ఈజీఎం మురళీకృష్ణ, ఆర్.ఐ.లు రామారావు, రాజేష్, నరేంద్ర, శ్రీమతి పద్మ, ప్రిన్సిపల్స్, డీన్ లు, ఉపాధ్యాయులు మరియు అకడమిక్ టీమ్ పాల్గొన్నారు.

Check Also

పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

-సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *