విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయానికి ఆషాఢమాసం సందర్భంగా సారే సమర్పణ వేడుక గులాబీతోటలో వైభవంగా జరిగింది. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా సారెను సమర్పించారు. భక్తులు ఉత్సవ మూర్తికి పట్టుచీర, పసుపు-కుంకుమ, గాజులు, పూజా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రతిఒక్కరిపై ఉండాలని, వారు చేపట్టే మంచి పనులన్నింటిలో ప్రజలు విజయం సాధించాలని కోరుకున్నారు. అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఈ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఇదేవిధంగా ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అనంతరం అమ్మవారి ఊరేంగిపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారి చేతులమీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి, శనగశెట్టి హరిబాబు, చల్లా శ్రీనివాస్, రాము, అప్పారావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల వరద సాయాన్ని త్వరగా అందించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు విజ్ఞప్తి -విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024కు ఆమోదం -విజయవాడ …