విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విశాఖ జిల్లా సీతంపేట గొల్ల వీధిలో గల శ్రీ కృష్ణ యువజన సేవా సంఘము భవనం వద్ద స్థానిక ప్రజలు 50 వయస్సు పైబడిన వారికి 500 మందికి అభినవ ధన్వంతరి కృష్ణ పట్టణం బోణిగి ఆనందయ్య యాదవ్ కరోనా నివారణ మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వహకులైన శ్రీ కృష్ణ యువజన సేవా సంఘము గౌరవ సలహాదారులు బోరా శ్రీనివాసరావు మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ గారు అమెరికాలో నివాసం ఉన్నప్పటికీ మాతృ భూమి మీద మమకారంతో ” పుట్టిన ఊరిని – కన్న తల్లిదండ్రులుని మరిచి పోకుండా తన తల్లి దండ్రులు పేరు మీద గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి తన తల్లి దండ్రులు పుట్టిన ఊరైన విశాఖలోని 15 నియోజక వర్గాలలోని పేద ప్రజలందరికీ 10000 వేల మందికి పైగా అభినవ ధన్వంతరి బోణిగి ఆనందయ్య కరోనా నివారణ మందు అందజేయడం అభినందనీయమన్నారు. శ్రీ కృష్ణ యువజన సేవా సంఘము అధ్యక్షులు బోరా ఈశ్వర రావు మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ నిస్వార్థంగా చేస్తున్న ఈ సామాజిక సేవా కార్యక్రమాల వల్ల ఎంతోమంది పేదవారికి లబ్ది చేకూరుతుందన్నారు. ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసిన రవి కృష్ణ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ వార్డ్ కౌన్సిలర్ సారిపల్లి గోవింద్, కృష్ణ యువజన సేవా సంఘము కార్యదర్శి సారిపల్లి గంగరాజు, గొలగాని రవి కృష్ణ విశాఖ టీం సభ్యులైన దుబాసి వాసుదేవ రావు, బోరా రాజేష్, విజనగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags Visakhapatnam
Check Also
మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …