విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ బంగారయ్య కొట్టు సెంటర్ వద్ద నుండి చిట్టి నగర్ వరకు, చిట్టినగర్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు కెటి రోడ్డు ఇరువైపులా రోడ్డుపై పడ్డ గోతులను, రోడ్ల అధ్వాన్న స్థితితో, పాటు ప్రధాన కాలువలను పరిశీలించారు. వాహనదారులు పాదచారులు రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రధాన రహదారి గుండా ప్రయాణం చేస్తున్నామని, గోతులు పడ్డ రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రమాదాల బారిన పడుతున్నామని కాలువలో మురుగు నీరు కూడా సరిగా పారడం లేదని తెలియజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రజల వద్ద నుండి పన్నులు వసూలు చేయడం పై ఉన్న శ్రద్ధ అధికారులకు మంత్రికి ప్రధాన రహదారి ని బాగు చేయడం పై లేదని, మంత్రిగారి ఇంటి ముందు రోడ్డు బాగుంటే నియోజకవర్గం మొత్తం రోడ్లు బాగా ఉన్నట్లేనని మంత్రి భావిస్తున్నారని, కొద్దిపాటి వర్షానికి చిట్టినగర్ ప్రాంతం మొత్తం జలమయం అవుతుందని , రోజు ఈ ప్రాంతం గుండా మంత్రి, మేయర్ ప్రయాణం చేస్తున్న రోడ్లకు కనీస మరమ్మతులు చేయాలని శ్రద్ధ కూడా లేదని , నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా విస్మరించి అవినీతి సంపాదన మీద మంత్రి దృష్టి సారించారని, ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారు కనుక కమిషనర్ మరియు విజయవాడ కలెక్టర్ తక్షణమే నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద నుండి చిట్టి నగర్ వరకు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టలని, మోతీ మసీదు వద్ద శాశ్వత పరిష్కారం గా ముంపు నివారించాలని, అసంపూర్ణంగా వదిలేసిన సైడ్ కాల్వల నిర్మాణం తక్షణమే పూర్తిచేయాలని, లేని పక్షంలో ఈ సమస్య పరిష్కారం కోసం జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం లోని అధికార పార్టీకి మరియు అధికారులకు కళ్ళు తెరిపించే లాగా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోరికని నాగమల్లేశ్వరరావు, వేవిన నాగరాజు, కొరగంజ. రమణ, బత్తుల.వెంకటేష్, రఘు, కుర్మరావు, అదిత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …