విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ నగరాల సీతారామస్వామి, శ్రీ మహలక్ష్మీ అమ్మ వార్ల దేవస్థానం లో శ్రీ మహలక్ష్మీ అమ్మ వారికి రెండవ రోజు శుక్రవారం శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు శుక్రవారం పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కమిటీ వారు అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, మరియు కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు (పిసి) భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా కరోనా జాగ్రత్తలు భక్తులకు దర్శనం అందించారు. రేపు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులచే సమర్పించిన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అమ్మ వారి విశేష అలంకారంతో పాటు అమ్మకు జరుగునున్న మన ” సారె” కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మ వారి తీర్దప్రసాదంలు స్వీకరించాలని దేవస్థానం కమిటీ వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహయకార్యదర్శి శీరం వెంకట్రావు, కార్యవర్గ సభ్యులు గూడేల రామకృష్ణ (ఆర్కే), మరియు గుజ్జరి అమర్, పణుకు రమేష్, కొరగంజి భాను తదితరులు పాల్గొన్నారు