మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు వివిద ప్రాంతాల నుంచి వచ్చిన వివిద సమస్యలపై వచ్చిన ప్రజలను వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కార చర్యలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక భొజ్జల్లి పేటకు చెందిన వృద్ధురాలు చిత్తజల్లు కోటేశ్వరమ్మ తనకు ఆదరించే వారు ఎవ్వరూ లేరని ఆనాదనని సాయం చేయాలని మంత్రిని కోరగా ఈమెకు కోవిడ్ టెస్ట్ చేయించి ఆనాద సర్టిఫికెట్ తీసుకుని ఈమెను ఆనాదవృద్ధాశ్రమంలో చేర్పించుటకు చర్యలు తీసుకోవాలని మంత్రి తమ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక నిజాం పేటకు చెందిన వృద్ధురాలు అంకాల రామామణి తన రెండు కాళ్లు పని చేయడం లేదని వైద్య సహాయం అందించాలని జీవనం కోసం ఏర్పాటు చేయించాలని కోరగా ఈమెకు అవసరమైన వైద్యం చేయించాలని, వికలాంగ పింఛను మంజూరుకు ధరఖాస్తు చేయించాలని మంత్రి తమ సిబ్బందికి సూచించారు.
బందరు మండలం చిన్నాపురం గ్రామానికి చెందిన చేనేత పని వారు బండారు నరేష్ తదితరులు తమ గ్రామంలో చేనేత మగ్గాలు 23 మందికి అవసరం కాగా 8 మందికి మాత్రమే ఇచ్చారని మిగత వారికి కూడా చేనేత మగ్గాలు మంజూరు చేయించాలని మంత్రిని కోరారు. ఇదే గ్రామానికి చెందిన బొడ్డు బాబూరావు తాడిగడపలో నివాసం ఉంటున్న తన అల్లుడు విశ్వనాదపల్లి సముద్రాలు 7 నెలల క్రితం కరెంట్ షాక్ తో చనిపోయారని వైయస్ఆర్ భీమా మంజూరు చేయించాలని కోరారు. స్థానిక రైల్వే స్టేషన్ నుండి బందరుకోటకు వెళ్లే రహదారి 2వ నెంబరు మైల్ రాయి దగ్గర 15 అడుగుల మేర మురుగుకాల్వకు గండి పడి వర్షం నీరు మురుగునీరు, ఉప్పునీరు ప్రవహించడం వలన పరిసర ప్రాంత పొలాలు ముంపునకు గురౌవుతున్నాయని గత సార్వలో 80 ఎకరాలలో రైతులు పంట నష్టపోయారని, సమస్య పరిష్కరించాలని కోరుతూ లోయ శ్రీనివాస్ తదితరులు అర్జీ సమర్పించారు.
Tags machilipatnam
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …