Breaking News

వ్యవసాయ రంగానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద పీట…


-రైతు భరోసా కేంద్రాలను మార్కెట్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాం….
-సహకార రంగం ఇలోపేతంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం….
-రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాయి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార రంగాన్ని బలోపేతం చేయాడమే ఒక పెద్ద లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార రంగం బ్రతుకు తేనే, సహకార రంగం అభివృద్ధి చెందితేనే ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో ఉన్న కింది స్థాయి చిన్న రైతులకు అందుతాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఎన్నికల ముందు నవరత్నాలు కింద చెప్పిన ప్రకారం సహకార రంగం వ్యవస్థ బలోపేతం చేసేందుకు సిఎం వైఎస్ఆగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారన్నారు. దీనిలో భాగంగా నాబార్డ్ చెందిన మరో అనుబంధ సంస్థలో అధ్యాయనం చేయించడం జరిగిందన్నారు. ఇటీవలనే అని వేదిక అందిందని దాని ప్రకారం సహకార రంగంలో మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఇప్పటివరకు సహకార రంగంలో ఏఎసి, డిసిసిబి, డిసియంఎస్, అప్కాబ్ లను తీసుకున్నప్పుడు పిఎసి, డిసిసిబి, డిసియంఎ హెల్తర్ పాలనీ లేదన్నారు. ఒక పెయిడ్ సెక్రటరీ ఏ సొసైటీలో నియమితులైయ్యారో అదే చోట రిటైర్ అయ్యే పరిస్థితి ఉందన్నారు. అదేవిధంగా డిసిసిబిలో ఒక ఉద్యోగి నియామకం జరిగితే అదే చోట రిటైర్ అయ్యే విధానం వుందన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని నిర్ణయాలు అవసరమని భావించి హెట్జర్ పాలసీ తీసుకువచ్చామన్నారు. సెక్రటరీ, డిసిసిబి ఉద్యోగుల బదిలీ విధానం తీసుకువచ్చామన్నారు. ఎదో కొందరి దయదాక్షిణ్యాల మీద ఈ సహకార రంగ వ్యవస్థ నడిచే పరిస్థితి వుండకూడదనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. పూర్తి రైతు బాగస్వామ్యంతో సహకార రంగంలో మరింత మెరుగైన సేవలు అందించగలుగుతామన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి నమ్మకమన్నారు.
ఈ రంగం అభివృద్ధికి కొంత నైపుణ్యత పరిజ్ఞానం జోడించాలని భావించి దీని కోసం ఆర్థిక రంగంలో అనుభవజ్ఞులైన వారిని తీసుకువచ్చి డిసిసిటీలో డైరెక్టర్లుగా నియమించాలనేది ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఈ రంగం బాగుండాలని భావిస్తూ భవిష్యత్తులో గ్రామీణ, ఆర్థిక వ్యవస్థలు ఊతం ఇస్తుందని నమ్ముతున్నాన్నారు.
రైతు సంక్షేమానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు అభివృద్ధిని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూస్తున్నయంటే ఆ నాయకుడు విజన్ అసాధారణ విజన్ అని చెప్పవచ్చునన్నారు. ఆ నాయకుడే మన ముఖ్యమంత్రి వైఎస్ఆగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే ఒక గొప్ప అవకాశం ఆయన ద్వారా వచ్చిందన్నారు. అన్ని రంగాలతో పాటు వ్యవసాయ, అనుబంధ రంగాలో కూడా ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గతంతో పోల్చుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పే ఒక మాట గుర్తోస్తోందన్నారు. ఎప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పే ఒక మాట రైతుల కోసం రాజశేఖర్ రెడ్డిగారు ఒక అడుగు ముందుకు చేస్తే తాను నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పాడం జరిగిందని అయితే సిఎం రైతుల కోసం వంద అడుగులు ముందుకు చేస్తున్నారని కన్నబాబు అన్నారు.
ఒక రూపాయి ప్రీమియం కట్టకుండా 2 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తు ఈ-క్రాప్ చేయించుకున్న ప్రతి ఎకరానికి ఇన్సూరెన్స్ వచ్చే విధానం సిఎం తీసుకువచ్చి దేశంలోనే ఒక రికార్డు సాధించారన్నారు.
పెట్టుబడి సాయం రూ. 13 వేల 500 కాకుండా ఎన్నికల సమయంలో రూ.50 వేలు ఇస్తామన్న మాటకు మించి దానిని రూ. 67,500 పెంచారని చెప్పారు. దీనితో పాటు వైఎస్ఆర్ జలకళ, వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలు, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు శాశ్వతంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అవసరమైన వసతులు కల్పనలో రాజీలేని విధానాలు ప్రభుత్వం అవలంభిస్తుందన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో 10,850 ఆబితాలను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించలేదన్నారు. రైతు భరోసా కేంద్రాలను మార్కెట్ కేంద్రాలుగా మార్చామని ఆయన పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు రాష్ట్రంలో ఈ ప్లాట్ఫారం తీసుకువస్తున్నామన్నారు.
కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎంతో చరిత్ర సృష్టించిన బ్యాంక్ అని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది ప్రముఖులు ఈ బ్యాంకుకు చైర్మన్లుగా పనిచేశారన్నారు. వసంత నాగేశ్వరరావు ఈ బ్యాంకుకు చైర్మన్‌గా పనిచేసి ఆప్కాబ్ చైర్మన్ గా వెళ్లరన్నారు. స్వతహగా వైద్యుడైన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి రంగానికి చికిత్స చేపట్టి సహకార రంగం అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నన్ని తిరిగి వారు తనయులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారన్నారు. గతంలో కొంతమంది గుత్తాధిపత్యంగా ఈ రంగాన్ని ఉపయోగించుకున్న పరిస్థితులకు మొట్టమొదటి సారిగా సిఎం బ్రేక్ చేశారన్నారు. ఈ రోజు కృష్ణా డిసిసిబికి నాగేశ్వరరావును చైర్మన్ గా, వివిధ వర్గాలకు చెందిన వారిని డైరెక్టర్లుగా అందులో ప్రత్యేకంగా మహిళాలు వుండేలా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. రాష్ట్రంలో కృష్ణా డిసిసిటీ మొదటి స్థానంలో ఉందన్నారు. రూ.7,200 కోట్ల టర్నవర్ తో రూ. 4,500 రుణసౌకర్యం కల్పిస్తూ రూ. 2700 కోట్లు డిపాజిట్లు కలిగి బ్రహ్మండంగా అభివృద్ధి చెందిందన్నారు. జిల్లాలో 460 ఏఎనలు కలిగి ఉన్న ఈ బ్యాంకును మరింత అభివృద్ధి చేసే అవకాశం వుందన్నారు. ఇంత పెద్ద బ్యాంకుకు నాగేశ్వరరావుకు చైర్మన్ గా బాధ్యతలు సిఎం కల్పించరంటే వారిపై ఎంత సమ్మకం వుందో తెలుస్తుందన్నారు. ఏ చిన్న తప్పుకు ఆస్కారం లేకుండా బ్యాంకు పాలక వర్గం పనిచేయాలన్నారు. గత చైర్మన్ గా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా బ్యాంక్ అభివృద్ధికి బాగా పనిచేశారన్నారు. కావల్సిన వారికి రుణాలు ఇవ్వడం, రూలకు వ్యతిరేకంగా రుణాలు ఇవ్వడం చేయవద్దని ఆయన పాలక వర్గానికి సూచించారు. వచ్చే ఏడాది నాటికి 10వేల కోట్ల రూపాయల టర్నవర్ సాధించాలని మంత్రి కన్నబాబు ఆలాంక్షించారు.
డిసిసిబిల స్థాయిలో కంప్యూటరీకరణ పూర్తి అయిందని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఎసిలను కూడా చేయడం జరుగుతుందన్నారు. దీని కోసం ఏడాది కాలంగా పనుల ప్రక్రియ ప్రారంభమైయిందని త్వరలో ఇవి రూపుదాల్చుకుంటాయన్నారు. అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాశామన్నారు. రైతుకు వాణిజ్య బ్యాంకుల కన్న మిన్నగా రైతులకు డిసిసిబిలు ఎక్కువ సేవలు అందించే విధంగా నిలబడ్డాయన్నారు. మన ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో 2,3 డిసిసిలీలు నష్టాల్లో వుండగా వాటిని లాభాల్లోకి తీసుకువచ్చామన్నారు. అప్కాబ్ 21 వేల కోట్ల రూపాయల టర్నవర్ కలిగి వుందన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టకముందే నాగేశ్వరరావు బ్యాంకు అభివృద్ధి పై మాట్లాడిన తీరుతో ఈ బ్యాంకు ఉజ్వల భవిష్యతులో వారి పాత్ర వుంటుందని నమ్ముతునన్నారు. బ్యాంకు నిర్వహణలో ఎటువంటి తప్పులు జరగకుండా పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఇందుకు సీఈవో స్థాయి నుంచి సెక్రటరీ వరకు ఎంతో అంకిత భావంతో పని చేసి పాలక వర్గానికి సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్లు కొమ్మినేని రవిశంకర్, నల్లమోతు కోటి సూర్యప్రకాశరావు, వేములకొండ రాంబాబు, భూక్యా రాణి, జి, పెద వెంకయ్య, పడమట సుతాతలతో కూడిన పాలకవర్గంతో మంత్రి కన్నబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాష్ట్ర మంత్రి కె. కన్నబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగిరమేష్, వసంత కృష్ణ ప్రసాద్, మొండితోక జగన్మోహన్ రావు, మహిళ కమిషన్ చైర్ సర్ఫన్ వాసిరెడ్డి పద్మ, ఏపిఎస్ఎన్ఎల్ చైర్మన్ పి. గౌతమ్ రెడ్డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బొప్పన భవకుమార్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ వసంత నాగేశ్వరరావు, కెడిసిసిటీ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు, బ్యాంక్ సీఈవో శ్యామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *