పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చే నియమించబడి బాధ్యతలు స్వీకరించిన దవులూరి దొరబాబు ను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ రంగనాధ రాజు అభినందించారు. శుక్రవారం పోడూరు మండలం తూర్పుపాలెం లో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రిని కలసిన ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ దవులూరి దొరబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు, పార్టీ విధేయులకు, మహిళలకు సమన్యాయం జరిగిందన్నారు. కష్ట పడి పనిచేస్తున్న వారికి తప్పకుండా తగిన గుర్తింపు వొస్తుందనడానికి దొరబాబు ఒక నిదర్శనం అన్నారు. నామినేటెడ్ పదవుల్లో భాగంగా నూతనంగా ఏపీ గృహ నిర్మాణ శాఖ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దవులూరి దొర బాబు గృహనిర్మాణమంత్రి రంగనాథరాజు ని సాధనంగా కలిసి పుష్ఫాకృత్యం ఇచ్చి శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలియ జేసారు. గృహ నిర్మాణశాఖ చైర్మన్ గా అవకాశం కలిపించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణశాఖ చెరుకువడా రంగనాథరాజుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు దొరబాబు తెలిపారు.