పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇటీవల వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులను నాణ్యతా ప్రమాణాలు తో మరమ్మత్తు లు చెయ్యాలని అధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరకువాడ రంగనాధ రాజు ఆదేశించారు. పెనుగొండ లో శుక్రవారం వర్షానికి పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను మంత్రి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాధ రాజు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్నందున నియోజక వర్గంలో పలు ఆర్ అండ్ బి, పంచాయ తీ రాజ్ రహదారు లు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించే దిశలో వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించి, కొన్ని రహదారుల్లో మరమ్మత్తులు చేపట్టారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి రహదారులను పరిశీలించామన్నారు. మరమ్మత్తులు చేపట్టాలని అధికారుల కు సూచించామని అన్నారు. పెనుగొండ పరిధిలో దెబ్బతిన్న రహదారి మార్గాల్లో తాను అధికారులు ఆకస్మాత్తుగా పర్యటించడం జరిగింది అన్నారు. ఆయా రహదారుల మరమ్మత్తులకు చెప్పట్ట వలసిన చర్యలపై అధికారులతో వివరాలను మంత్రి అడిగి తెలుసుకునీ, రోడ్లు నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. మండలం లో పర్యటించిన మంత్రి వర్యులు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులను, పంచాయతీ రాజ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులను, పంచాయతీ రాజ్ అధికారులు నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Tags penugonda
Check Also
ఏపీలో సాహసోపేత క్రీడా కార్యకలాపాలు నిర్వహించాలి
-శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు -ఆర్మీ అడ్వెంచర్ వింగ్ డైరెక్టర్ కల్నల్ చౌహాన్‌తో భేటీ -అడ్వెంచర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ …