విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుర్రం జాషువా 50 వ వర్ధంతి కార్యక్రమం శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుఱ్ఱం జాషువా సాహిత్య వేదిక అధ్యక్షులు డా మట్టా ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలపై జరుగుతున్న అసమానతలను ప్రశ్నించిన విశ్వనరుడు జాషువా అని అన్నారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విరసం రాష్ట్ర అధ్యక్షులు అరసవిల్లి కృష్ణ మాట్లాడుతూ సమాజంలో అగ్రవర్ణాల ఆధిపత్యం క్రింద నలిగిపోతున్న నిమ్నవర్గాల ప్రజల గొంతుగా తన కాలాన్ని జులిపించిన మహాయోధుడు జాషువా అన్నారు. సామాజిక సాధికార కమిటీ అధ్యక్షులు కాండ్రు సుదాకర్ బాబు మాట్లాడుతూ కులసమాజం పట్ల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన విశ్వనరుడు జాషువా అన్నారు. ఈ కార్యక్రమంలో గండి అగస్టీన్, శ్యాం ప్రసాద్, కందుల చిట్టిబాబు, జాన్ పాల్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఈనెల 27 వతేదీ కి మండల కమిటీ లు పూర్తి చేయాలి…
-బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి …