-జిల్లా మహిళా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ డిమాండ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు మోర్ల లక్ష్మీ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బి.సి.ల కులాల వారి జనగణన చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్నాయని కేవలం ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నారన్నారు. గత పాదయాత్ర లో జగన్మోహన్ రెడ్డి కులాల వారి జనగణన చేపడతామని చెప్పి ఇప్పటివరకూ దాని ఊసే ఎత్తడంలేదని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని కేవలం రెండు రోజుల్లో కులాలవారి జనగణన చేపట్టవచ్చుని గుర్తు చేశారు. కేంద్రంలో మోడీ బి.సి.వణిగా చెప్పుకొచ్చి ఇప్పుడు 2021 జనగణన సమయంలో జనాభా లెక్కల్లో కేవలం ఎస్టీ ఎస్సీ లకి తప్పా ఇతర కులాల జనాభాని లెక్కించడం కుదరదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో ప్రకటించడం బి.సి.ల ఆశలపై నీళ్లు చల్లడమేనని వాపోయారు. ఎప్పుడైతే కులాల వారి జనగణన జరుగితోందో అప్పుడే రాజ్యాధికారంలో ,అభివృద్ధి లో దామాషా ప్రకారం వారి వాటా దక్కుతుందని తెలిపారు. ఇప్పటికైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జనగణన చేయించి వారి అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు. లేకపోతే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయడానికి సన్నాహాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటీ మహిళా అధ్యక్షురాలు డి. సామ్రాజ్యం, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థను ఉ